త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SC, ST Commission | 48 గంట‌ల్లోగా నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ఆదేశం

SC, ST Commission | బీఆర్ఎస్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డీజీపీని ఆదేశించారు.

S

Telangana | Published On Sep 7, 2026, 7.14 pm IST

SC, ST Commission | 48 గంట‌ల్లోగా నివేదిక ఇవ్వండి.. డీజీపీకి ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ఆదేశం
Advertisement

SC, ST Commission | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డీజీపీని ఆదేశించారు.

సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై దాడి, అనుచిత ప్రవర్తన, బెదిరింపులు, అవమానించడం, వారి విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, జె. అనిల్ జాదవ్, విజయుడు, మానిక్ రావు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషన్ ఘటనపై తీవ్రంగా స్పందించింది.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల గౌరవం, భద్రత, చట్టబద్ధమైన హక్కులకు సంబంధించిన అంశం కావడంతో ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని చైర్మన్ సూచించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించి, బాధ్యులైన వ్యక్తులు, అధికారులపై తీసుకున్న చర్యల వివరాలతో కూడిన పూర్తి నివేదికను 48 గంటల్లోగా* సమర్పించాలని డీజీపీని ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా కమిషన్ తన పరిధిలో తదుపరి చర్యలు తీసుకుంటుందని బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.

Advertisement
Advertisement