త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tenth Results | జూన్ 5 నుంచి ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

Tenth Results | తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను జూన్ 5 నుంచి 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Apr 29, 2026, 6.44 pm IST

Tenth Results | జూన్ 5 నుంచి ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు
Advertisement

Tenth Results | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను జూన్ 5 నుంచి 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఈ నెల 30 నుంచి మే 14వ తేదీ వ‌ర‌కు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ అప్లికేష‌న్ల‌కు ఏప్రిల్ 30 నుంచి మే 15 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు.

ప‌ది ఫ‌లితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు వెల్ల‌డించారు. బాలికల్లో 96.26 శాతం, బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,731 పాఠశాలల్లో 100 శాతం పాస్​ అయ్యారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30శాతం ఉత్తీర్ణత రాగా అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 89.23 శాతం మంది విద్యార్థులు పాస్​ అయ్యారు.

Advertisement
Advertisement