Terrorists | తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు..!
Terrorists | బోర్‌వెల్ కంపెనీలో పని చేస్తూ బతుకుదెరువు కోసం ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కిడ్నాప్‌కు గురై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమ కుమారుడి ఆచూకీ లభించలేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Terrorists | బోర్‌వెల్ కంపెనీలో పని చేస్తూ బతుకుదెరువు కోసం ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కిడ్నాప్‌కు గురై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమ కుమారుడి ఆచూకీ లభించలేదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బండ సోమారం గ్రామానికి చెందిన నల్లమస ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ బోర్‌వెల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా 2024 నవంబర్ నెలలో ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లాడు. అక్కడే ఉంటూ పని చేస్తున్నాడు. చివరి సారిగా ఈ ఏడాది నవంబర్ 22వ తేదీన ప్రవీణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. 23 నుంచి ప్రవీణ్ ఫోన్ స్విచ్ఛాప్ అయిపోయింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. సంబంధిత బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. ప్రవీణ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉండిపోయి.. కుమారుడిని తలచుకొని ఏడుస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ తండ్రి మాట్లాడుతూ.. తమ బిడ్డ ప్రవీణ్ గతేడాది నవంబర్‌లో మాలి దేశానికి వెళ్లాడు. ఈ ఏడాది నవంబర్ 23న ప్రవీణ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు బోర్‌వెల్ నిర్వాహకులు తెలిపారు. రెండు వారాలు అవుతున్నప్పటికీ తమ కుమారుడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళనకు గురవుతున్నామని తండ్రి జంగయ్య తెలిపాడు. కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, ఎంత డబ్బులు ఖర్చైనా క్షేమంగా తీసుకొస్తామనే హామీ ఇచ్చారని జంగయ్య పేర్కొన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ కుమారుడిని వీలైనంత త్వరగా మా దగ్గరకు చేర్చాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
- ●BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!

Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు



