Dasoju Sravan Kumar | తెలంగాణను మరో బీమారు రాష్ట్రంగా మార్చారు.. ఆర్థిక దివాళానే రేవంత్ ఇచ్చిన నజరానా
Dasoju Sravan Kumar | సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను మరో బీమారు రాష్ట్రంగా మార్చారని.. రాష్ట్రానికి ఆయన ఇచ్చిన నజరానా ఆర్థికంగా దివాళా తీయడమేనని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. రేవంత్‌కు పాలన చేతగాక రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తోందన్నారు.
- రూ.6,857 కోట్ల సర్‌ప్లస్ బడ్జెట్ పెడితే రూ.12,289 కోట్ల బడ్జెట్ లోటు వచ్చింది
- సీఎం, మంత్రుల ఆస్తులు పెరుగుతున్నయ్.. ప్రభుత్వ ఆస్తులు తగ్గుతున్నయ్
- వారిని గల్లాలు పట్టి నిలదీయాలి
- మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్
Dasoju Sravan Kumar | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను మరో బీమారు రాష్ట్రంగా మార్చారని.. రాష్ట్రానికి ఆయన ఇచ్చిన నజరానా ఆర్థికంగా దివాళా తీయడమేనని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. రేవంత్‌కు పాలన చేతగాక రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తోందన్నారు. 90 రోజుల ఆర్థిక పరిపాలనలో 12 వేల కోట్ల పైచిలుకు రెవిన్యూ లోటు వచ్చిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఆస్తులు వ్యక్తిగతంగా ఎట్లా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు మాత్రం తగ్గుతున్నాయని ఆరోపించారు. ఈమేరకు ఆయన తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాగ్ రిపోర్ట్‌తో బట్టబయలు..
కాంగ్రెస్ బడ్జెట్ అంతా బోగస్ అని కాగ్ రిపోర్ట్ చెప్పింది. కాగ్ రిపోర్ట్‌లో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయిందని స్పష్టం చేసింది. రూ.6,857 కోట్ల సర్‌ప్లస్ బడ్జెట్ పెట్టారు. ఆరు నెలల్లో రూ.12,289 కోట్ల బడ్జెట్ లోటు వచ్చింది. ట్యాక్స్ రెవెన్యూ 22 శాతం మాత్రమే వచ్చింది. జీఎస్టీ తగ్గిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ రెవెన్యూలోనూ 18 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఖజానాకు నష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సొల్లు వాగుడు, బూతు పురాణాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. తెలంగాణ ఆర్థికంగా దివాళా తీస్తోంది. రేవంత్ బీఆర్ఎస్ నాయకుల జాతి, నీతి అడుగుతున్నారు. ముందు నీది ఏ జాతో చెప్పు? అని దాసోజు ఫైరయ్యారు.
ఇప్పటికే 4.50 లక్షల కోట్ల అప్పులు చేశారు..
రేవంత్ రెడ్డి వ్యక్తిగత దోపిడీకి పాల్పడుతున్నారు. వైన్ షాపులు, బెల్టు షాపులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ఖజానాను పందికొక్కుల్లా దోచుకుతింటున్నారు. 75 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి 5.7 శాతం గ్రాంట్లు మాత్రమే తెచ్చారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే 4.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆర్థిక సంవత్సరం అయ్యే సరికి లక్ష కోట్ల రెవెన్యూ లోటు వస్తుంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తారు? ఫ్యూచర్ సిటీ ఎట్లా కడతారు? మెట్రోను ప్రభుత్వం తీసుకుని 12 వేల కోట్ల అప్పు ప్రజలపై భారం వేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను గల్లాలు పట్టి నిలదీయాలి అని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు
సెప్టెంబర్ 10, 2026

Legislative Council Session | పాటలు పాడుతూ.. శాసన మండలిలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళన
సెప్టెంబర్ 10, 2026

Revanth Reddy | Joining 80’s trend.. రెట్రో లుక్‌లో సీఎం రేవంత్
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
- ●Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!
- ●Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు
- ●Apple iPhone Duo | రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో.. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే..
- ●Legislative Council Session | పాటలు పాడుతూ.. శాసన మండలిలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళన

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..

Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్

BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!

Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు



