త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gutha Sukender Reddy | ఏ జిల్లా నీరు ఆ జిల్లాకే కావాలంటే.. కర్ణాటక నుంచి దిగువకు చుక్క నీరు కూడా రాదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy | పాల‌మూరు రైతుల‌ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే డిండి లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టును త‌క్ష‌ణమే ర‌ద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్య‌ల‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) స్పందించారు.

G

Telangana | Published On Oct 25, 2026, 12.52 pm IST

Gutha Sukender Reddy | ఏ జిల్లా నీరు ఆ జిల్లాకే కావాలంటే.. కర్ణాటక నుంచి దిగువకు చుక్క నీరు కూడా రాదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
Advertisement

Gutha Sukender Reddy | త్రినేత్ర న్యూస్‌: పాల‌మూరు రైతుల‌ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే డిండి లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టును త‌క్ష‌ణమే ర‌ద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్య‌ల‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) స్పందించారు. ఆమె వ్యాఖ్య‌లు స‌రికావ‌ని విమ‌ర్శించారు. జాతీయ పార్టీలో ఉండి ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిప‌డ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (Palamuru Project) జాతీయ హోదా కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ఏ జిల్లా నీరు ఆ జిల్లాకే పరిమితం కావాలంటే కర్ణాటక నుంచి దిగువకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు.

ఏఎంఆర్పీ (AMRP) ద్వారా ఏడాది పొడవునా 30 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు (Hyderabad) తరలిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును (Dindi Project) చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల మేరకే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలు ప్రతిపాదిత సాగుకు గానూ 7.78 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు జరుగుతుంద‌ని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం, డిండి, దేవాదుల 7.58 లక్షల ఎకరాల ప్రతిపాదన ఉంటే.. ఏదీ పూర్తికాల‌దేని వెల్ల‌డించారు.

గత ప్రభుత్వాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. నీటి పంపకాల విషయంలో వివాదాలకు దిగితే నల్లగొండ (Nalgonda), మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగమే నష్టపోతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement