SIR Survey | రాష్ట్రంలో సర్ సర్వే వాయిదా.. ఎందుకంటే?
SIR Survey | రాష్ట్రంలో జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ వాయిదా పడింది. జనగణన, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) వాయిదా వేసింది.
SIR Survey | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ వాయిదా పడింది. జనగణన, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) వాయిదా వేసింది. దీనిని జాన్‌లో చేపట్టాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం సర్ సర్వే ప్రక్రియను (SIR Survey) ఏప్రిల్ నెలలో నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో జనగణనలో భాగంగా సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలు ఉండటంతో దీనిని వాయిదా వేసింది. 25 ఏండ్లకు ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సమగ్ర సవరణ చేస్తున్నది. గతంలో 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా జరిగింది. అప్పటి జాబితా ఆధారంగా 2025 ఓటర్ల లిస్ట్ మ్యాపింగ్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నది.
సర్ సర్వేను దేశవ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహిస్తున్నది. మొదటి దశ బీహార్‌లో గతేడాది ముగిసింది. రెండో దశలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా మొత్తం 11 రాష్ట్రాల్లో చేపట్టింది. మ్యాపింగ్ పూర్తయి సర్ ప్రక్రియ చివరి దశకు చేరింది. మూడో విడతలో తెలంగాణసహా మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు సుమారు 80 శాతానికిపైగా పూర్తయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం ముగిసింది. ఏప్రిల్‌లోనే సర్ ప్రారంభించాలని భావించిన ఈసీ.. అందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ప్రస్తుతానికి ఈసీ వాయిదా వేసింది.
కాగా, రాష్ట్రంలో రెండు చోట్ల నమోదైన ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే నిర్వహించిన సర్వేలో 2 లక్షల ఓట్లను తొలగించారు. సర్వే పూర్తయితన తర్వాత చనిపోయినవారి పేర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వారి పేర్లను కూడా జాబితా నుంచి తీసివేయనున్నారు.
సంబంధిత వార్తలు

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
జులై 6, 2026

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 6, 2026

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
జులై 6, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్



