Leprosy Cases | రాష్ట్రంలో మళ్లీ విజృంభిస్తున్న కుష్టు.. కొత్తగా 2500 కేసులు
Leprosy Cases | రాష్ట్రంలో మళ్లీ కుష్టు వ్యాధి (Leprosy) కలకలం సృష్టిస్తున్నది. 2005లో కుష్టు వ్యాధి నిర్మూలన దశకు చేరుకున్నామని ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ.. ఈ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది.
Leprosy Cases | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మళ్లీ కుష్టు వ్యాధి (Leprosy) కలకలం సృష్టిస్తున్నది. 2005లో కుష్టు వ్యాధి నిర్మూలన దశకు చేరుకున్నామని ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ.. ఈ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. కొన్నేండ్లుగా వేల సంఖ్యలో కొత్త కేసులు (Leprosy Cases) నమోదుకావడం ఆదోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2024-25లో 2,376 కుష్టు వ్యాధి కేసులు నమోదు కాగా, 2025–-26 నాటికి ఈ సంఖ్య 2,592కు చేరింది. గతేడాది 85 మంది పిల్లల్లో వ్యాధి లక్షలణాలు కనిపించగా, ఈ ఏడాది వారి సంఖ్య 100కు పెరిగింది.
ఎలా వస్తుందంటే..

మైకోబాక్టీరియం లెప్రా (Mycobacterium Leprae) అనే బ్యాక్టీరియా వల్ల కుష్టు వస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. ప్రధానంగా చర్మం, నరాలు, కళ్లపై ప్రభావం చూపుతుంది. చర్మంపై లేత రంగు, ఎర్రటి మచ్చలు రావడం ప్రధాన లక్షణాలు. చేతులు, కాళ్ల దగ్గర నరాలు గట్టిపడటం, తిమ్మిర్లు పట్టడం, చూపు మందగించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయిన వైద్యులు తెలిపారు. వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినప్పుడు ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, బాధితులతో ఎక్కువ కాలం సన్నిహితంగా ఉంటేనే ఇది సోకే ప్రమాదం ఉంటుందన్నారు. కుష్టు వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని, లేనట్లయితే చేతులు, కాళ్ల వేళ్లు వంకర్లు పోవడం, స్పర్శ లేకపోవడం వల్ల కాళ్లకు అయ్యే గాయాలు పుండ్లుగా మారి పాదాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
వ్యాధి నివారణకు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉచిత చికిత్స అంటుబాటులో ఉందని చెప్పారు. వ్యాధి తీవ్రతను బట్టి 6 నుంచి 12 నెలల పాటు మందులు వాడితే ఈ మహ్మారి నుంచి బయటపడవచ్చని తెలిపారు. మందులు వాడటం ప్రారంభమైనప్పటి నుంచి వ్యాధి ఇతరులకు సోకడం తగ్గిపోతుందని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



