Global Summit | ‘తెలంగాణ రైజింగ్-2026’ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు..
Global Summit | డిసెంబరులో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్-2026' గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సకాలంలో సిద్ధం చేయాలని సూచించారు.
Global Summit | డిసెంబరులో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్-2026' గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సకాలంలో సిద్ధం చేయాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ గ్లోబల్ సమ్మిట్ కీలకంగా మారనుందని చెప్పారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, సంక్షేమం తదితర రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్స్' కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సంజయ్ జాజు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవన సముదాయాలను వినియోగించుకోవాలని సూచించారు. సమ్మిట్‌కు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరా సహా అన్ని మౌలిక సదుపాయాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేయడం, పెట్టుబడులను పెంపొందించడం, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను విస్తరించడం, ఉపాధి కల్పనను బలోపేతం చేయడం, డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం వంటి అంశాలపై సమావేశంలో అధికారులు చర్చించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!

Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!






