Karikaala | ‘కరికాల’గా సందీప్ కిషన్.. కెరీర్‌లోనే తొలిసారిగా యోధుడి పాత్రలో..!
Karikaala | యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కరికాల’. దర్శకుడు ఉగంధర్ ముని రూపొందిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఫస్ట్‌లుక్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించిన విషయం తెలిసిందే.
Entertainment | Published On Aug 5, 2026, 4.48 pm IST
Karikaala | యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కరికాల’. దర్శకుడు ఉగంధర్ ముని రూపొందిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఫస్ట్‌లుక్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించిన విషయం తెలిసిందే. ఫస్ట్‌లుక్‌లో సందీప్ కిషన్ దట్టమైన అరణ్యంలో గుర్రంపై దూసుకెళ్తూ, చేతిలో కత్తితో యోధుడి అవతారంలో కనిపించాడు. సమాంతరంగా సింహం పరుగెత్తుతున్నట్లుగా ఉన్న పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషియో ఫాంటసీ జానర్‌లో మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజ్యాలు, అద్భుత శక్తులు, క్రూర మృగాలు, జానపద గాథలను మేళవిస్తూ సరికొత్త సోషియో ఫాంటసీ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించనున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ పూర్తి స్థాయి యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్ర కోసం ఆయన పూర్తిగా కొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. యాక్షన్‌తో పాటు ఫాంటసీ అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దినట్లు సమాచారం. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
భారీ విజువల్ ఎఫెక్ట్స్, అత్యున్నత నిర్మాణ విలువలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో తొలి భాగాన్ని 2027 జూలై 2న, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘శంభాల’ విజయానంతరం దర్శకుడు ఉగంధర్ ముని మరింత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?



