త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Revenue | సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా..!! తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనం

Telangana Revenue | సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేఏఎస్), రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో రెవెన్యూ క్లబ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి టీజీఈజేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, టీజీఈజేఏసీ కో చైర్మన్ కే.రామకృష్ణ, టీజీటీఏ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాకతో కలిసి పాల్గొన్నారు.

S

Telangana | Published On Apr 29, 2026, 5.29 pm IST

Telangana Revenue | సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా..!! తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనం
Advertisement

Telangana Revenue | త్రినేత్ర‌.న్యూస్ : సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (కేఏఎస్), రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో రెవెన్యూ క్లబ్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి టీజీఈజేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, టీజీఈజేఏసీ కో చైర్మన్ కే.రామకృష్ణ, టీజీటీఏ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాకతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సేవల్లో అధికారులు సమగ్రత, సమర్ధత కలిగి ఉండటానికి రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై వారు స్టడీ చేశారు. ఈ స్టడీ టూర్ ద్వారా అధికారులు ప్రభుత్వ సేవల్లో కలిగి ఉండాల్సిన వృత్తి నైపుణ్యం, విధుల్లో బాధ్యత, ఆధునిక పరిపాలనా దృక్పథానికి ఒక కొత్త దిశను గుర్తించారు. రెవెన్యూ క్లబ్ లక్ష్యం అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం, సేవల నాణ్యతను మెరుగుపరచడం, మరియు పరిపాలనలో సమర్థతను పెంచడం తదితర ప్రధాన అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరంతర అభ్యాసం, పరిశోధనాత్మక ఆలోచన, ప్రాక్టికల్ అడ్మినిస్ట్రేషన్ నైపుణ్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించారు.

కర్నాటక ప్రభుత్వం నుండి ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సహకారం

రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌కు కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహం అందించడం, ప్రభుత్వానికి ఈ కార్యక్రమంపై ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తు చేస్తున్నట్టు తమ అధ్యయనంలో గుర్తించారు. కర్నాటక రెవెన్యూ అసోసియేషన్ చరిత్ర కూడా ఎంతో గొప్పదే కావడం గమనార్హం. 1919లో మైసూరు సివిల్ సర్వీస్ అసోసియేషన్‌గా ప్రారంభమై 1983లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(కేఏఎస్)గా రూపాంతరం చెంది, అప్పటి నుండి అధికారుల సంక్షేమం, శిక్షణ, మరియు సమర్థ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక సంస్థగా ఇది కేవలం ఉద్యోగుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, సమాజానికి మెరుగైన సేవలు అందించడంలో కూడా తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పరిపాలనా వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములు. అధికారుల మధ్య సమన్వయం పెంచడమే కాకుండా, విధానాల అమలులో ఉన్న లోపాలను గుర్తించి, వాటి పరిష్కారానికి మార్గదర్శకంగా ఉండేలా రూపొందించారు. ఇలాంటి రెవెన్యూ క్లబ్‌లు ఒకవైపు ఉద్యోగుల హక్కులను కాపాడుతూనే, మరోవైపు ప్రభుత్వ లక్ష్యాల సాధనలో భాగస్వాములవుతున్నాయి. ఇలా ద్విముఖ పాత్రే వాటి ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల అనుభవాల నుండి నేర్చుకోవడం ఈ కాలంలో అత్యంత అవసరమే. కర్ణాటక వంటి రాష్ట్రాలు తమ సంస్థల ద్వారా ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం, స్వయం సమృద్ధి సాధించడం, మరియు అధికారుల నైపుణ్యాభివృద్ధిని సంస్థాగతంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలు మనకు ఆదర్శంగా నిలుస్తాయని టీజీఈజేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. ఈ విధమైన అధ్యయన పర్యటనలు (స్టడీ విజిట్స్) ద్వారా మంచి పద్ధతులను (బెస్ట్ ప్రాక్టీసెస్) గుర్తించి, వాటిని మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా స్వీకరించడం అత్యంత ప్రాముఖ్యమైనదని అన్నారు.

ప్రజా సంక్షేమంలో ఉద్యోగ సంఘాల పాత్ర కీలకం కావాలి..

తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పాత్ర మరింత కీలకంగా మారుతోందని వి.లచ్చిరెడ్డి అన్నారు. పాలనలో పారదర్శకత, వేగం, మరియు ప్రజలతో అనుబంధం పెరగాలంటే అధికారుల నైపుణ్యం, విజన్, మరియు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఉద్యోగ సంఘాలు ముందడుగు వేయడం సమయానుకూలమని ఆయన అన్నారు. అంతేకాకుండా, అన్ని రాష్ట్రాల సివిల్ సర్వీస్ సంఘాలతో సమన్వయం పెంచి, ఆల్ ఇండియా స్థాయిలో పూర్తి అవగాహన సాధించడం వల్ల పరిపాలనలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సహకారం ద్వారా విధానాల్లో కొత్త ఆలోచనలు, సమర్థవంతమైన అమలు పద్ధతులు అభివృద్ధి చెందుతాయన్నారు. మొత్తానికి, కర్ణాటకలో ప్రారంభమైన ఈ రెవెన్యూ క్లబ్ మరియు రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ దేశానికి ఒక ఆదర్శ నమÖనాగా నిలుస్తుందని లచ్చిరెడ్డి ఆభిప్రాయపడ్డారు. ఈ అనుభవాన్ని పాఠంగా తీసుకుని, మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా, ప్రజలకందుబాటులో ఉండేలా చేయవచ్చని లచ్చిరెడ్డి అన్నారు.

Advertisement
Advertisement