Paddy Procurement | లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచండి.. అధికారులకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశం
Paddy Procurement | రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) చురుకుగా సాగుతున్న నేపథ్యంలో అవసరమైన లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Paddy Procurement | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) చురుకుగా సాగుతున్న నేపథ్యంలో అవసరమైన లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, రైస్ మిల్లులకు ధాన్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ధాన్యం తరలింపు విషయంలో జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా వెంటనే వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం తరలించే రవాణా వాహనాలన్నింటికీ చెల్లుబాటయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఆర్‌సీ, ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పీయూసీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నందున, రవాణా వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలతో సమన్వయంతో వ్యవహరించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. రవాణా సమయంలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రవాణా ఏర్పాట్లపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



