Telangana Political Parties | తెలంగాణ పేరుతో వచ్చిన పార్టీలు ఇవే.. స్థాపకులు వీరే..!
Telangana Parties | ఎన్నో ఏళ్లు గోసపడ్డ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించేందుకు ఈ గడ్డపై ఎన్నో పార్టీలు పురుడు పోసుకున్నాయి. ఎన్నో సమీకరణాల నేపథ్యంలో ఏర్పాటైన ఈ పార్టీలన్నీ తమ శక్తిమేర ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాయి. కానీ చాలా పార్టీలు చివరి వరకు నిలవలేదు.
Telangana Parties | త్రినేత్ర.న్యూస్ : ఎన్నో ఏళ్లు గోసపడ్డ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించేందుకు ఈ గడ్డపై ఎన్నో పార్టీలు పురుడు పోసుకున్నాయి. ఎన్నో సమీకరణాల నేపథ్యంలో ఏర్పాటైన ఈ పార్టీలన్నీ తమ శక్తిమేర ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాయి. కానీ చాలా పార్టీలు చివరి వరకు నిలవలేదు. ఆదిలోనే కొన్ని పార్టీలు కనుమరుగు కాగా, మరికొన్ని పార్టీలు.. కొంత వరకు మనుగడ సాధించినప్పటికీ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించలేకపోయాయి. అన్ని పార్టీలు రాష్ట్ర సాధనలో సఫలీకృతం కాలేదనే చెప్పొచ్చు. కానీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కేవలం తెలంగాణ పేరుతో వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అనేది జనమెరిగిన సత్యం.
అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణ పేరుతో నాలుగైదు పార్టీలు ఏర్పాటయ్యాయి. ఈ పార్టీలన్నీ ఒక్కో ట్యాగ్‌లైన్‌తో ఏర్పాటు అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, తాజా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకే పార్టీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ పేరుతో మరో పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పార్టీని అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ పేరుతో వచ్చిన పార్టీలు ఇవే..
తెలంగాణ ప్రజా సమితి (ముచ్చర్ల సత్యనారాయణ)
జై తెలంగాణ పార్టీ(ఇంద్రారెడ్డి)
తెలంగాణ రాష్ట్ర సమితి(కేసీఆర్)
తెలంగాణ సాధన సమితి( ఆలె నరేంద్ర)
నవ తెలంగాణ పార్టీ ( దేవేందర్ గౌడ్)
తల్లి తెలంగాణ పార్టీ( విజయశాంతి)
తెలంగాణ ఇంటి పార్టీ( చెరుకు సుధాకర్)
తెలంగాణ రక్షణ సమితి (డాక్టర్.రాజేశ్వర్ రావు)
తెలంగాణ నగారా సమితి( నాగం జనార్ధన్ రెడ్డి)
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్( గద్దర్)
తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (విమలక్క)
తెలంగాణ జన సమితి ( కోదండరాం)
వైఎస్సార్ తెలంగాణ పార్టీ( షర్మిల)
తెలంగాణ రాజ్యాధికార పార్టీ( తీన్మార్ మల్లన్న)
తెలంగాణ రాష్ట్ర సేన ( కవిత)
మరిన్ని పార్టీలు..
ప్రజా తెలంగాణ సమితి
సామాజిక తెలంగాణ పార్టీ
తెలంగాణ భార జనతా పార్టీ
తెలంగాణ రాజ్యసమితి పార్టీ
తెలంగాణ పార్టీ
తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఐక్య జన్ పార్టీ
తెలంగాణ లేబర్ పార్టీ
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ
తెలంగాణ సకల జనుల పార్టీ
తెలంగాణ యువసేన పార్టీ
తెలంగాణ యువశక్తి పార్టీ
యువ తెలంగాణ పార్టీ
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






