BRS | రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం మరింత ఉదృతం: తెలంగాణ ఎన్ఆర్ఐలు
BRS | రానున్న రోజుల్లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని లండన్‌లోని తెలంగాణ ఎన్ఆర్ఐలు స్పష్టం చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ (BRS) యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు.
BRS | త్రినేత్ర.న్యూస్: రానున్న రోజుల్లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని లండన్‌లోని తెలంగాణ ఎన్ఆర్ఐలు స్పష్టం చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ (BRS) యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. వారికి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరిబాబు నవాపేట్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో పార్టీ కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎంతో పోరాటం చేస్తుందన్నారు. వారికి సంఘీభావంగా పార్టీ కార్యకర్తలుగా రానున్న రోజుల్లో అటు సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, పార్టీ నాయకత్వం ఎన్నారైలను ఎంతో ప్రోత్సహిస్తుందని, కష్టపడి పని చేస్తే గుర్తింపు లభిస్తుందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. గత పదిహేనేండ్లుగా లండన్‌లో పార్టీ చేస్తున్న కార్యక్రమాలను, ఎన్నారైలు పార్టీకి అండగా ఉంటూ చేస్తున్న సేవలని నూతన సభ్యులకి వివరించారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా నిలిచామని, అదే స్ఫూర్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే సలహామండలి చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ సూచించారు.
అందరికీ ఇంతటి అవకాశం కలిపించిన కేసీఆర్‌కి సంస్థ పక్షాన ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల కృతఙ్ఞతలు తెలిపారు. కేవలం రాజకీయ పార్టీ వేదికలా కాకుండా ఎలాంటి సమస్యలున్నా కుటుంబంలా మనమంతా కలిసి ఉంటామని, ఏదైనా సమస్యలుంటే సంప్రదించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అన్నారు. మనం మరింత ఉత్సాహంతో పని చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలని, 420 హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి అండగా నిలబడి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. ప్రతిపక్షంగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని విశ్లేషణాత్మకంగా గణాంకాలతో సహా వివరించి ప్రశ్నిస్తున్నామని కార్యదర్శి రవి ప్రదీప్ గౌడ్ పులుసు అన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉదృతంగా ప్రభుత్వ అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇసెంపల్లి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్వైసరీ బోర్డు చైర్మన్ సీక చంద్ర శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, అడ్వైసరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, కార్యదర్శి, ఐటీ, మీడియా అండ్ పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కార్యదర్శులు అబూ జాఫర్, సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇసెంపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, కార్యదర్శి, యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల, మెంబర్ షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్, ముఖ్య సభ్యులు ఉన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



