Telangana | రైతులకు పిడుగులాంటి వార్త.. పాత పద్ధతిలో పంట కొనుగోళ్లకు ఇక నుంచి స్వస్తి
Telangana | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పిడుగులాంటి వార్త వినిపించింది. ఇక నుంచి పాత పద్ధతిలో కొనుగోళ్లకు స్వస్తి పలుకుతున్నామని ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. పంట కొనుగోళ్ల విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటాకు లోబడి పంటలను కొంటామని వెల్లడించింది.
కేంద్రం చెబితేనే పంట కొంటాం
పంట కొనుగోళ్ల విషయంలో
కేంద్రం నిర్దేశించిన కోటానే అనుసరిస్తాం
30న రైతు భరోసా విడుదల
మధిర సభలో పంపిణీ
7 రకాల సన్నాలకే బోనస్
ఎల్ ని నో దుష్ప్రభావాలకు సిద్ధంగా ఉండండి
వర్షాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు
మొదటి వానకే విత్తు విత్తకండి
రెండు సార్లు 7 మిల్లీ మీటర్ల వర్షం పడితేనే
విత్తేందుకు సిద్ధమవండి
రామగుండం నుంచి యూరియాను
మన వాటా మనకు ఇవ్వాల్సిందే
లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
అలాట్ చేసినంత యూరియా కూడా
కేంద్రం సరఫరా చేయడం లేదు
మంత్రి వర్గ నిర్ణయాలను వెల్లడించిన
మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క
రైతులు పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.అయితే.. భవిష్యత్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటానే అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఏయే పంట ఉత్పత్తులకు ఎంఎస్సీ(కనీస మద్దతు ధర) నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్రం తరపున కొనుగోలు చేయాలని నిర్ణయించాం
-నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైతులందరికీ ముఖ్యమైన సూచన. ఎల్ నినో దుష్ప్రభావాలకు సిద్ధంగా ఉండండి.మొదటి వానకే విత్తు విత్తకండి. ఆదుర్దా వద్దు. రెండు సార్లు కనీసం 7 మిల్లీ మీటర్ల వర్షం పడితేనే పదును వస్తుంది. కార్తె వెళ్లిపోతుందని కంగారు వద్దు. వర్షాల రాకను బట్టి విత్తనాలు విత్తండి. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సారి తెలంగాణలో అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవచ్చు.
-వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
Telangana | త్రినేత్ర.న్యూస్ (2026 జూన్ 18): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పిడుగులాంటి వార్త వినిపించింది. ఇక నుంచి పాత పద్ధతిలో కొనుగోళ్లకు స్వస్తి పలుకుతున్నామని ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. పంట కొనుగోళ్ల విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటాకు లోబడి పంటలను కొంటామని వెల్లడించింది. ఈ మేరకు గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ నిర్ణయాలను.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ..
30న మధిరలో రైతు భరోసా విడుదల
వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయనున్నారు.
ఈ 7 సన్నాలకే బోనస్
రైతులు పండించే సన్న దాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715... ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది.
ఈ సారి వర్షాలు.. కష్టమే
ఎల్ నినో ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉండబోతున్నది. అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవచ్చు. అందుకే రైతులు తొలివానకే విత్తనాలు విత్తకుండా..కొంచెం వేచి చూడాలి. వరుసగా 2 సార్లు 7 మిల్లీమీటర్ల వర్షం పడితేనే నేల పదునవుతుంది. అనుకున్న స్థాయిలో వర్షం పడితేనే విత్తండి. లేదంటే..విత్తి నష్టపోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్రంలో
83 శాతం మంది రైతులు మేం చెప్పిన ఆ 7 సన్నాలనే పండిస్తున్నారు. వాటికే మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంది. రైతులు కూడా వాటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మిల్లర్లు కూడా వాటినే కొంటున్నారు. శాస్త్రీయంగా అన్ని సరిచూసుకున్నాకే ఆ 7 సన్నాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం.
కేంద్రం నిర్దేశించిన కోటాలోనే ఇక నుంచి కొనుగోళ్లు..
యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దేశంలోనే 29 రాష్ట్రాల్లో యాసంగి పంటలో ఈ స్థాయిలో సేకరణ జరగలేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ శాతం ధాన్యం సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏయే పంట ఉత్పత్తులకు ఎంఎస్సీ(కనీస మద్దతు ధర) నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్రం తరపున కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
రామగుండం నుంచి యూరియా ఇవ్వాలి
వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను విడుదల చేయాలని మంత్రి వర్గం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అనేకసార్లు లేఖలు రాశారు. ఆ కోటాను కేంద్రం వెంటనే విడుదల చేయాలని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా తెలంగాణకు కేటాయించాలని మంత్రి వర్గం డిమాండ్ చేసింది.
వీబీజీ రామ్ జీని వ్యతిరేకిస్తున్నాం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి కొత్తగా కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని మంత్రి వర్గం వ్యతిరేకిస్తున్నది.పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కొత్త చట్టం అమలుతో కూలీలపైనా, రాష్ర్త ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామి అధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
మెట్రో రుణాన్ని మంజూరు చేయండి
మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి వర్గం విజ్ఞప్తి చేసింది. ఐఆర్ ఎఫ్సీ నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరింది. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు బీజేపీ నేతలు కూడా కలిసిరావాలని కోరింది.
ఇక నుంచి డిజిటల్ క్యాబినెట్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్ గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరికీ స్పెషల్ ట్యాబ్ లు అందజేశారు. ఇకపై ఈ ట్యాబ్ ద్వారానే క్యాబినెట్ సమావేశం ఎజెండా.. నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. ఇకపై కాగితాలతో పనిలేకుండా డిజిటల్ విధానంలో కేబినేట్ మీటింగ్ లు జరుగుతాయి. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షకు రాష్ట్రంలో దాదాపు 208 పరీక్ష కేంద్రాల్లో 2 లక్షల 95 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ 'ఆర్థిక మోసాలు' బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు
- ●Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్
- ●Telangana Crop Procurement | ఇది 'పేపర్‌లెస్' కాదు.. 'ఫెయిత్లెస్' క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!
- ●OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!

Telangana CAG Report 2026 | రేవంత్ సర్కార్ 'ఆర్థిక మోసాలు' బట్టబయలు: కాగ్ (CAG) రిపోర్టుతో కాంగ్రెస్ బండారం బయటపెట్టిన డాక్టర్ శ్రవణ్ దాసోజు

Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్

Telangana Crop Procurement | ఇది 'పేపర్‌లెస్' కాదు.. 'ఫెయిత్లెస్' క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!

OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం




