త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఫ్యూచ‌ర్ లేనోడ‌ళ్ల ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తాడ‌ట.. హ‌రీశ్‌రావుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్

CM Revanth Reddy | మేం అధికారంలోకి వ‌స్తే భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తామ‌ని ప‌దేప‌దే చెబుతున్న బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 30 వేల ఎక‌రాల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ క‌ట్టుకుందామంటే.. కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలు క‌ట్టండి అని తాటిచెట్టు చెబుతుండు అని హ‌రీశ్‌రావును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Jun 18, 2026, 7.04 pm IST

CM Revanth Reddy | ఫ్యూచ‌ర్ లేనోడ‌ళ్ల ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తాడ‌ట.. హ‌రీశ్‌రావుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మేం అధికారంలోకి వ‌స్తే భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తామ‌ని ప‌దేప‌దే చెబుతున్న బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 30 వేల ఎక‌రాల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ క‌ట్టుకుందామంటే.. కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలు క‌ట్టండి అని తాటిచెట్టు చెబుతుండు అని హ‌రీశ్‌రావును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ఫ్యూచ‌ర్ లేనోడ‌ళ్ల ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేస్తా అంటున్న‌డు.. నువ్వు సిద్దిపేట‌లో గెలుస్తే క‌దా నువ్వు ఫ్యూచ‌ర్ సిటీ ర‌ద్దు చేసేది అని సీఎం అన్నారు. ఎల్‌బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గుర్రంగూడ‌లో వ‌న‌మ‌హోత్స‌వం 2026 కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్ర‌సంగించారు.

బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌లో 420 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో పార్కు నిర్మించాల‌ని ఆదేశించాం. చెరువులు, కుంటులు, నాలాలు ఆక్ర‌మించొద్దు.. ఎంత పెద్ద వ‌ర్షం వ‌చ్చినా నీళ్లు నిల‌వొద్దు.. టీవీలు, ఫ్రిజ్‌లు, పుస్త‌కాలు స‌ర్టిఫికెట్లు నీళ‌ల్లో త‌డ‌వొద్ద‌ని చెప్పి.. వ‌ర‌ద నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించాం. గ‌తంలో భారీ వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు స‌రూర్ న‌గర్ ప్రాంతంలో బ‌స్తీలు నీట మునిగాయి. ఆ కష్టాల‌కు కార‌ణ‌మైన క‌బ్జాదారుల కోర‌లు పీకాల‌ని హైడ్రాను తీసుకువ‌చ్చాం. కానీ దాన్ని భూతంగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రైతే చెరువులు క‌బ్జా పెట్టుకుంట‌రో, కుంట‌లు, నాలాలు.. పార్కుల‌కు క‌బ్జా పెట్టుకునోళ్ల‌కు మాత్రం వీపు సున్నం అయిత‌ది. గుడికి సంబంధించిన స్థ‌లాల‌ను క‌బ్జా పెట్టుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా పార్కు, గుడుల‌ను అభివృద్ధి చేస్తున్నాం. కొద్ది మంది క‌బ్జా చేసుకుంటే వేలాది కుటుంబాలు న‌ష్టాన్ని భ‌రిస్తున్నాయి.. క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. కాల‌నీల్లో నీళ్లు ఉండ‌డానికి క‌బ్జారాయుళ్లే కార‌ణం. క‌బ్జారాయుళ్ల‌ను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు అని సీఎం రేవంత్ హెచ్చ‌రించారు.

మ‌న న‌గ‌రానికి ఆ ప‌రిస్థితి రావొద్దు..

ఢిల్లీలో గాలి, నీరు విషం, అక్క‌డ నివ‌సించ‌లేని ప‌రిస్థితి. పాఠ‌శాల‌లు, పార్ల‌మెంట్, ప‌రిశ్ర‌మ‌లు బంద్. పాల‌కులు ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, కాలుష్యాన్ని నియంత్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఢిల్లీ న‌గ‌రానికి ఆ ప‌రిస్థితి దాపురించింది. బెంగ‌ళూరులో ట్రాఫిక్ స‌మ‌స్య ఉంది. ఇవాళ మ‌న న‌గ‌రానికి ఆ ప‌రిస్థితి రావొద్దు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో న‌గ‌రాన్ని అభివృద్ధి చేసుకోవాల‌ని మూసీ ప్ర‌క్షాళ‌న చేప‌ట్టుకున్నాం. కానీ అడ్డుప‌డుతున్నారు. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టు, ఐటీ కంపెనీలు తేక‌పోయి ఉంటే అంత‌ర్జాతీయంగా గుర్తింపు వ‌చ్చేదా..? నాడు కూడా అడ్డుకున్నారు.. కానీ దేవేంద‌ర్ గౌడ్ నిరంత‌రం కృషి చేసి ఎయిర్‌పోర్టుకు భూమి సేక‌రించారు. హైటెక్ సిటీ కట్టారు కాబ‌ట్టి ఐటీ కంపెనీలు వ‌చ్చాయి. సిరీస్ కంపెనీ దెబ్బ‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోయారు. బోరింగ్ నీళ్లు ప‌చ్చ‌గా వ‌చ్చేవి అని సీఎం గుర్తు చేశారు.

చెరువులు, కుంట‌లు నాలాలు ఆక్ర‌మిస్తే తోడ్క‌లు తీస్తా..

న‌గ‌రాన్ని కాలుష్యం చేసుకుందామా..? సిరీస్ లాంటి ఫార్మా కంపెనీలు మ‌ళ్లీ తెచ్చుకుందామా..? అలాంటి ప‌రిశ్ర‌మ‌ల‌ను వంద‌ల కొద్ది తెచ్చి ఫ్యూచ‌ర్ సిటీలో పెడుతామ‌ని దిక్కుమాలినోడు చెబుతున్న‌డు. గాలి, నీరు క‌లుషిత‌మైతే మ‌న జీవితాలు ఆగ‌మైపోతాయి. ల‌క్ష‌ల కోట్లు కూడా స‌రిపోవు ద‌వ‌ఖానాకు. అందుకే ఆలోచ‌న చేసి.. 30 వేల సిటీలో 15 వేల ఎక‌రాల‌ను పార్కు కింద అభివృద్ధి చేయ‌డానికి వ‌న‌మే మ‌నం మ‌న‌మే వ‌నం అని గొప్ప న‌గరాన్ని త‌యారు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. అమ్ముడుపోయిన వ్య‌క్తి కూడా మూసీ క‌ట్టొద్దు అంటున్న‌డు. ఎవ‌రు ఏమ‌నుకున్నా మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం. అంత‌ర్జాతీయ స్థాయిలో మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ చేసే బాధ్య‌త నాది. చెరువులు, కుంట‌లు నాలాలు ఆక్ర‌మిస్తే తోడ్క‌లు తీస్తా. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ క‌ట్టి తీరుతా.. పారిశ్రామిక‌వేత్త‌లు ఫ్యూచ‌ర్ సిటీని చూసి నేర్చుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement