Ponnam Prabhakar | భారత్ అంటే నరేంద్ర మోదీ ఒక్కరే కాదు.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
Ponnam Prabhakar | భారత్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే కాదు.. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించి ఆహ్వానించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం తీరు సంకుచిత బుద్ధికి నిదర్శనం..
ప్రతిపక్ష నేతలను అవమానించడమా..?
ఇదేం రాజకీయ నీతి..
ఇప్పటికైనా భారత్ ఐక్యత చాటాలి..
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : భారత్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే కాదు.. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించి ఆహ్వానించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధికి ఆయా రాష్ట్రాల ఐక్యత అవసరం.. కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరించడం సరైంది కాదు అని పొన్నం పేర్కొన్నారు.
ఢిల్లీలో నిర్వహించిన భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ బీజేపీ పార్టీది కాదు భారత ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం. తెలంగాణలో విజన్ 2047 భారత్ సమ్మిట్ కార్యక్రమం చేపట్టినప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించాం. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కూడా ఆహ్వానించామని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు.
ప్రతీసారి ప్రతిపక్ష నాయకులకు అవమానం..
భారత్ ఏఐ సమ్మిట్‌ను అడ్డుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. నిన్న జరిగిన ఏఐ సమ్మిట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం. భారతదేశం ప్రపంచ దేశాల ముందు మేమంతా ఒకటే నాయకుల మధ్య ఐక్యత ఉంది అని చాటాల్సి ఉండే. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రతిసారీ ప్రతిపక్ష నాయకులను అవమాన పరుస్తోందని పొన్నం మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతను అవాయిడ్ చేస్తారా..?
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు రాహుల్ గాంధీకి ఎక్కడో 3వ లైన్‌లో సీటు కేటాయించారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మంత్రితో సమానంగా ప్రతిపక్ష నాయకులను సైతం గౌరవించిన చరిత్ర మాది. ప్రతిపక్ష నాయకులను సైతం ముందు లైన్‌లో కూర్చోబెట్టే వాళ్ళం. మీరు సంకుచితంగా వ్యవహరించడం సరికాదు. భారతదేశం అనేది విశాల దృక్పథంతో భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. మన మధ్యలో రాజకీయాలు ఉంటే పార్లమెంట్ వేదికగా మాట్లాడుకోవాలి. ఇంత పెద్ద అంతర్జాతీయ సదస్సు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిని కావాలని అవాయిడ్ చేయడం ఇదేం రాజకీయ నీతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రశ్నించారు.
గాంధీ కుటుంబం అంటే ఇండియాకి పర్యాయ పదం..
భారత పురాణ గాథల్లో విశాల దృక్పథం ఉంటుంది.. ఆ మాదిరి భారత ప్రభుత్వం విశాల దృక్పథాన్ని చాటుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అవమానించి మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖం మీదనే పడుతుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలను ఆపలేరు. రాహుల్ గాంధీని మీరు ఎంత అడ్డుకుంటే ఆయన వైభవం ఆయన కీర్తి అంత ఎత్తుకు ఎదుగుతుంది. రాహుల్ గాంధీ పదవుల కోసం, హోదా కోసం ప్రాకులాడే వ్యక్తి కాదు. దేశం కోసం ప్రాణాలను పెంచిన కుటుంబం గాంధీలది.. వారి నాన్న, నానమ్మ దేశం కోసం ప్రాణాలర్పించారు. ప్రపంచ దేశాల్లో గాంధీ కుటుంబం అంటే ఇండియాకి పర్యాయపదంగా ఉండేది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ విధానాలు మారి ప్రపంచ దేశాల ముందు భారత్ ఐక్యతను చాటాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



