త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganesh Immersion | గ‌ణేశ్ నిమ‌జ్జ‌నంలో అప‌శృతి.. ఐదుగురు భ‌క్తులు మృతి

Ganesh Immersion | గ‌ణేశ్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. నిర్మ‌ల్, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్‌, జ‌గిత్యాల జిల్లాల్లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు భ‌క్తులు మృతి చెందారు. దీంతో మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

S

Telangana | Published On Sep 25, 2026, 3.31 pm IST

Ganesh Immersion | గ‌ణేశ్ నిమ‌జ్జ‌నంలో అప‌శృతి.. ఐదుగురు భ‌క్తులు మృతి
Advertisement

Ganesh Immersion | త్రినేత్ర న్యూస్ : గ‌ణేశ్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. నిర్మ‌ల్, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్‌, జ‌గిత్యాల జిల్లాల్లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు భ‌క్తులు మృతి చెందారు. దీంతో మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

నిర్మ‌ల్ జిల్లాలోని క‌డెం ప్రాజెక్టు బ్యాక్ వాట‌ర్‌లో శుక్ర‌వారం ఉద‌యం వినాయ‌కుడి విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేస్తుండ‌గా.. ఓ వ్య‌క్తి నీటిలో మునిగి చ‌నిపోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని గాలింపు చేప‌ట్టి, మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుడిని చుంచు ర‌మేశ్‌(45)గా గుర్తించారు. ఆయ‌న‌కు భార్య‌, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఎల్వి గ్రామ స‌మీపంలోని గోదావ‌రిలో గ్రామ‌స్తులు గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేశారు. వినాయ‌కుడి విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేస్తుండ‌గా.. ప్ర‌మాద‌వ‌శాత్తు లోకండే విశాల్‌(26) నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా బుడ్డిపెల్లిలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా తండ్రా అహ‌న్ రుద్ర‌(16) అనే యువ‌కుడు నీటిలో మునిగిపోయాడు.

జ‌గిత్యాల జిల్లా కొత్త‌పేట గ్రామంలో వినాయ‌కుడి శోభాయాత్ర‌కు సంబంధించి సౌండ్ సిస్ట‌మ్ ఏర్పాటు చేస్తుండ‌గా, విద్యుత్ షాక్ త‌గిలి కొప్పుల రాజశేఖ‌ర్(23) మృతి చెందాడు. ఇదే జిల్లాలో తుల‌సిన‌గ‌ర్‌లో డ్యాన్స్ చేస్తుండ‌గా తోప‌రాపు అజ‌య్(48) గుండెపోటుతో ప్రాణాలొదిలాడు.

Advertisement
Advertisement