త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Journalists | జర్నలిస్టుల సమస్యలను ప‌రిష్క‌రించండి.. డిప్యూటీ సీఎం భ‌ట్టికి విజ్ఞ‌ప్తి

Telangana Journalists | జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గడువుతో కూడిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

S

Telangana | Published On Oct 17, 2026, 7.53 pm IST

Telangana Journalists | జర్నలిస్టుల సమస్యలను ప‌రిష్క‌రించండి.. డిప్యూటీ సీఎం భ‌ట్టికి విజ్ఞ‌ప్తి
Advertisement

Telangana Journalists | త్రినేత్ర న్యూస్ : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గడువుతో కూడిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రతినిధి బృందం కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించింది.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ హైదరాబాద్‌కు నామమాత్రపు ధరకు స్థలం కేటాయింపు, జర్నలిస్టులకు హెల్త్ కార్డుల జారీ, ఇళ్ల స్థలాల కేటాయింపు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించడం వంటి ప్రధాన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లింది. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ స్థలానికి సంబంధించిన ఫైల్ తన వద్ద పెండింగ్‌లో ఉందని, దానిని ఒకటి రెండు రోజుల్లో క్లియర్ చేస్తానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ ప్రతినిధి బృందంలో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వారికుప్పల, కోశాధికారి రమేష్ వైట్ల, సీనియర్ జర్నలిస్టులు ఆర్. రవికాంత్ రెడ్డి, నేమాని భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement