Telangana Jana Samithi | మే మెదటి వారంలో తెలంగాణ జన సమితి ప్లీనరీ
Telangana Jana Samithi | తెలంగాణ జన సమితి నాలుగవ రాష్ట్ర ప్లీనరీ హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ నిర్ణయించింది. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో టీజేఏస్ రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ సమావేశం అధ్యక్షులు ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరిగింది.
Telangana Jana Samithi | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ జన సమితి నాలుగవ రాష్ట్ర ప్లీనరీ హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ నిర్ణయించింది. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో టీజేఏస్ రాష్ట్ర విస్తృత స్థాయి కమిటీ సమావేశం అధ్యక్షులు ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు, రాజకీయ ప్రక్షాళన కొరకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టంగా నిర్మాణం చేయాలని, స్థానికంగా ప్రజా సమస్యలపై గళమెత్తాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రధాన సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజా ఆందోళనలను నిర్మించాలని అన్నారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎత్తివేసే సుప్రీంకోర్టు తీర్పును ప్రజల్లో ఎండగట్టాలని, దీని కోసం కలిసి వచ్చే శక్తులతో కలిసి దళితులైన వారి జన్మ హక్కును కాపాడడం కోసం ఉద్యమించాలని ఆయన అన్నారు. రోజురోజుకు తీవ్రమవుతున్న కార్మికుల సమస్యలపై ప్రధానంగా ఆర్టీసీ పరిరక్షణ, సింగరేణి పరిరక్షణకై ప్రత్యేక కార్యచరణకు పూనుకుందామని అన్నారు.
రాజకీయాలు అంటేనే డబ్బుల ప్రవాహంగా మార్చిన సమకాలీన జూదపు రాజకీయాలను ఎండగడుతూ ప్రజాస్వామిక రాజకీయాల నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి పనిచేస్తుందని అన్నారు. మే మొదటి వారంలో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీలో నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధం కావాలని ఆయన పార్టీ రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్లీనరీ విజయవంతం కొరకు పలు కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మార్జున్, అంబటి శ్రీనివాస్, బైరి రమేష్, పల్లె వినయ్ కుమార్, గోపగాని శంకర్ రావు, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఆశప్ప, టీజేఏస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాషా, టీజేఏస్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ ప్రసాద్, టీజేఏస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఏమ్. నర్సయ్య తదితరులు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



