త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | జీవో నంబ‌ర్ 4తో డిగ్రీ లెక్చ‌రర్ల భ‌ర్తీలో అన్యాయం : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

Kalvakuntla Kavitha | యువ‌త‌కు ఉద్యోగాలు ద‌క్క‌కుండా జీవోల‌తో ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోంద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలను తమవారికే ఇచ్చేలా జీవో నంబర్ 4 తీసుకొచ్చింది అని ఆమె ఆరోపించారు.

S

Telangana | Published On Apr 1, 2026, 4.20 pm IST

Kalvakuntla Kavitha | జీవో నంబ‌ర్ 4తో డిగ్రీ లెక్చ‌రర్ల భ‌ర్తీలో అన్యాయం : క‌ల్వ‌కుంట్ల క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : యువ‌త‌కు ఉద్యోగాలు ద‌క్క‌కుండా జీవోల‌తో ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోంద‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలను తమవారికే ఇచ్చేలా జీవో నంబర్ 4 తీసుకొచ్చింది అని ఆమె ఆరోపించారు. జాగృతి కార్యాల‌యంలో క‌విత మీడియాతో మాట్లాడారు.

నిరుద్యోగ యువతను కాంగ్రెస్ తమ రాజకీయ లబ్ధికోసం వాడుకుంది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చెబితే నమ్మరని రాహుల్ గాంధీతో అశోక్ నగర్‌లో హామీ ఇప్పించారు. రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల కుటుంబాల్లో విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. నేను తొక్కుకుంటూ పైకి వచ్చాను అంటూ ముఖ్యమంత్రి గారు చెబుతుంటారు. నిజంగానే నిరుద్యోగుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటూ మీరు అధికారంలోకి వచ్చారు అని క‌విత ధ్వ‌జ‌మెత్తారు.

ఫీజు రీయింబర్స్‌ మెంట్ కోసం ఏడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వటం లేదు. కానీ మూసీకి మాత్రం 7 వేల కోట్లు కేటాయించారు. మీరు హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వటం లేదు. రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేసిన సరే దానికి ఏదో ఒక జీవో అడ్డంగా మారింది. సిన్సియర్‌గా ఆ జీవోల మీద ఈ ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయటం లేదు. ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ల నోటిఫికేషన్ కు జీవో నంబర్ 4 అడ్డంగా మారింది. డీఎస్సీ కి జీవో నంబర్ 104, గ్రూప్స్ కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగాలకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81, ఆడబిడ్డలకు రిజర్వేషన్లు రాకుండా చేస్తున్న జీవో నంబర్ 4. ఎందుకు ఈ జీవోల మీద సిన్సియర్‌గా ప్రభుత్వం రివ్యూ చేయటం లేదు. వెంటనే ఈ మొత్తం జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. 2011 తర్వాత ఇప్పటి వరకు డిగ్రీ లెక్చరర్ల నోటిఫికేషన్ వేయలేదు. 15 ఏళ్ల తర్వాత వేసిన నోటిఫికేషన్‌కు జీవో నంబర్ 4ను అడ్డం పెట్టారు. స్టేట్ ఎలిజ‌బుల్ టెస్ట్‌ను మీరు మూడేళ్లుగా నిర్వహించలేదు. దీంతో చాలా మంది అర్హత లేకుండా పోయే పరిస్థితి ఉంది. అదే విధంగా ఇంటర్వ్యూకు పది మార్కులు అని పెట్టారు. ఇది ఎవరికి అనుకూలంగా ఉండేందుకు చేస్తున్నారు. హీహెచ్‌డీకి 25 మార్కులు వెయిటేజీ పెట్టారు. అసలు చాలా రోజులుగా పీహెచ్‌డీ అడ్మిషన్లే లేవు.

తమ వారి కోసం గ్రూప్-1లో ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు.. ఇప్పుడు కూడా డిగ్రీ లెక్చరర్లను తమ వారిని చేసే కుట్ర జరుగుతోంది. అందుకే జీవో నంబర్ 4ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 9 నెలల క్రితం పెట్టిన నర్సింగ్ ఎగ్జామ్ ఫలితాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యే జీవో ల మీద రివ్యూ చేసే సమయం ఈ ప్రభుత్వానికి లేదా? ఉద్యోగాల రిక్రూట్ మెంట్ కు అడ్డుగా ఉన్న జీవోలను వెంటనే రద్దు చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగి నిరుద్యోగులను సమాయాత్తం చేస్తాం నోటిఫికేషన్లు వేసే వరకు ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం. ఇంతమంది నిరుద్యోగుల కన్నీటి గాథలు ఇలా ఉంటే... ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఆటలు ఆడుతున్నారు అంటే నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం చాలా లైటర్ వే లో ఆలోచిస్తోంది.

ఇక ఈ అంశం ఇలా ఉంటే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు రేషన్ కార్డుల అంశం మారింది. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదంటూ ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుంది. ఈ ప్రభుత్వం 5 లక్షల రేషన్ కార్డులు ఇస్తే 10 నుంచి 15 లక్షల రేషన్ కార్డులను తీసేసే ప్రయత్నం చేస్తోంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని, చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారు. చిరుద్యోగులకు మేలు జరిగే రేషన్ కార్డుల విషయంలో పైశాచిక పనులు చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాన‌ని క‌విత పేర్కొన్నారు.

Advertisement
Advertisement