Inter Exams | నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వచ్చేయండి..
Inter Exams | రాష్ట్రంలో నేటినుంచి ఇంటర్ పరీక్షలు (Inter Exams) ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష జరుగనుండగా, గురువారం నుంచి సెకండర్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి.
Inter Exams | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో నేటినుంచి ఇంటర్ పరీక్షలు (Inter Exams) ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష జరుగనుండగా, గురువారం నుంచి సెకండర్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలుంటాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 4,89,126 మంది విద్యార్థు మొదటి సంవత్సరంలో, 5,07,949 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నాయి. వీరికోసం 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా సమయానికి 5 నిమిషాలు ఆలస్యమైన అనుమంతిచనున్నారు. ఆ తర్వాత అంటే ఉదయం 9.05 దాటిన తర్వాత వచ్చేవారికి పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను ఎగ్జామ్ హాల్‌కు అనుమతిస్తామని చెప్పారు. ఈసారి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు పూర్తి 3 గంటలూ పరీక్షా కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ముందే పరీక్ష పూర్తి చేసినా.. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే వరకూ ఉండాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే 040-24655027, 924402 05555 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
మంత్రి పొన్నం విషెస్
ఇంటర్ విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విషెస్ చెప్పారు. పరీక్ష రాసేందుకు వెళ్లే అమ్మాయిలు ఆర్టీసీలో ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదన్నారు. వారి హాల్ టికెట్ చూపిస్తే చాలని.. వారికి ఉచిత టికెట్ ఇస్తారన్నారు. ఇంటర్ విద్యార్థుల కోసం అదనంగా ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరీక్షల సమయంలో బస్టాండ్స్ దగ్గరే కాకుండా.. విద్యార్థులు ఎక్కడ ఆపినా ఆపాలని సిబ్బందికి సూచించారు.
తాజావార్తలు
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
- ●Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా
- ●TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
- ●Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
- ●KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్..!
- ●Horoscope | సెప్టెంబర్ 29 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?

Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా

TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్

Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత




