త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG BIE | రేప‌ట్నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

TG BIE | ఈ నెల 13 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇంట‌ర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

S

Telangana | Published On May 12, 2026, 6.02 pm IST

TG BIE | రేప‌ట్నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు
Advertisement

TG BIE | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 13 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇంట‌ర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సెకండియ‌ర్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

13 నుంచి 21వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఈ ప‌రీక్ష‌ల‌కు 3,98,358 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు. ఇందులో ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థులు 2,67,285 మంది కాగా, సెకండియ‌ర్ విద్యార్థులు(ప్రయివేటు) 1,31,073 మంది హాజ‌రు కానున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 889 ప‌రీక్షా కేంద్రాల‌ను కేటాయించ‌గా, ఇందులో 327 ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలు, 102 ప్ర‌భుత్వ సెక్టార్ జూనియ‌ర్ కాలేజీలు, 460 ప్ర‌యివేటు జూనియ‌ర్ కాలేజీల‌ను కేటాయించారు. 889 మంది చీఫ్ సూప‌రింటెండెంట్లు, 889 మంది డిపార్ట్‌మెంట‌ల్ ఆఫీస‌ర్లు, 10,685 మంది ఇన్విజిలేట‌ర్లు, 75 మంది ఫ్ల‌యింగ్ స్క్వాడ్స్‌, 75 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ విధుల్లో ఉండ‌నున్నారు.

అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు ఇంట‌ర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement