IAS Amrapali | హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్‌లో డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఐఏఎస్ అధికారిణి క్యాట్‌లో సవాలు చేశారు. దీంతో ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరపు న్యాయవాదికి ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 6 వారాలకు కోర్టు వాయిదా వేసింది.