Jio Small Data Packs | జియోలో రూ.30 లోపు లభిస్తున్న ప్లాన్లు ఇవే.. వీటితో ఏమేం బెనిఫిట్స్ వస్తాయంటే..?
Jio Small Data Packs | టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎల్లప్పుడూ అద్భుతమైన మొబైల్ ప్లాన్లను అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రత్యేకంగా ప్రీపెయిడ్ వినియోగదారులకు పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్లాన్లను రూ.30 లోపు రీచార్జికే జియో అందిస్తోంది.
Technology | Published On Dec 31, 2025, 6.34 am IST
Jio Small Data Packs | టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎల్లప్పుడూ అద్భుతమైన మొబైల్ ప్లాన్లను అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రత్యేకంగా ప్రీపెయిడ్ వినియోగదారులకు పలు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్లాన్లను రూ.30 లోపు రీచార్జికే జియో అందిస్తోంది. అయితే అంత తక్కువగా ఏమేం ప్లాన్లు వస్తున్నాయి..? అసలు వాటితో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి..? అని చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఈ ప్లాన్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి కేవలం డేటా ప్యాక్‌లు మాత్రమే. బేస్ ప్లాన్లు కాదు. కనుక ఈ ప్యాక్‌లను వాడుకోవాలంటే కచ్చితంగా ఏదైనా ఒక బేస్ ప్లాన్‌ను వినియోగదారులు వాడుతూ ఉండాలి. అలాంటి ప్లాన్లు ఉన్నవారికి మాత్రమే ఈ ప్యాక్‌లు వర్తిస్తాయి. కనుక ఈ ప్యాక్‌లను వాడుకోవాలంటే వినియోగదారులు తమ నంబర్‌పై. బేస్ ప్లాన్ యాక్టివ్‌లో ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. ఆ తరువాతే ఈ ప్యాక్‌లను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జియో రూ.30 లోపు అందిస్తున్న ప్యాక్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రూ.11, రూ.19, రూ.29..
రిలయన్స్ జియో రూ.30 లోపు ప్రీపెయిడ్ ప్యాక్‌లలో రూ.11, రూ.19, రూ.29లను అందిస్తోంది. ఇవన్నీ కేవలం డేటా ప్యాక్‌లు మాత్రమే. కేవలం డేటా మాత్రమే వీటితో లభిస్తుంది. ఎలాంటి వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు లభించవు. అలాగే ఈ ప్యాక్‌లు అన్నీ చాలా తక్కువ వ్యవధిని కలిగి ఉన్నాయి. కనుక ఎమర్జెన్సీ సమయాల్లో వాడుకునేందుకు వీలుగా ఈ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చామని జియో వెల్లడించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యవసర సమయాల్లో ఈ ప్యాక్‌లను తక్కువ వ్యవధిలో వాడుకోవాల్సి ఉంటుంది. ఇక రూ.11 రీచార్జి ప్యాక్ ద్వారా వినియోగదారులకు 10జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్యాక్ వ్యవధి కేవలం 1 గంట మాత్రమే. కనుక ఆలోపు 10జీబీ డేటాను పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అత్యవసరమైనప్పుడు కాస్త డేటా అవసరం పడితే ఈ ప్యాక్‌ను వాడుకోవచ్చు.
ఎమర్జెన్సీ సమయాల్లో..
ఇక రూ.19కి అందుబాటులో ఉన్న ప్యాక్ ద్వారా 1జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్‌కు 1 రోజు వరకు వాలిడిటీని ఇచ్చారు. కనుక ఒక రోజులోగా 1జీబీ డేటాను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులకు వాట్సాప్, గూగుల్ మ్యాప్స్, లైట్ బ్రౌజింగ్ వంటి పనులకు తక్కువ కాల వ్యవధికి ఈ ప్యాక్ పనిచేస్తుంది. అలాగే రూ.29 డేటా ప్యాక్ ద్వారా 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ 2 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. దీన్ని కూడా ఎమర్జెన్సీ సమయాల్లో తేలికపాటి డేటా అవసరాల కోసం వాడుకోవచ్చు. ఇలా ఆయా ప్యాక్‌లను జియో ప్రీపెయిడ్ వినియోగదారులు వాడుకోవచ్చు. ఇక ఈ ప్యాక్ ల ద్వారా ఎలాంటి ఇతర ప్రయోజనాలు లభించవు. కాల్స్, ఎస్ఎంఎస్‌లు రావు. కేవలం డేటా మాత్రమే అది కూడా నిర్దేశించిన వ్యవధి వరకు మాత్రమే వస్తుంది. అలాగే ఈ ప్యాక్‌లను వాడుకోవాలంటే కచ్చితంగా ఏదైనా ఒక బేస్ ప్లాన్ ఉండాలి.
సంబంధిత వార్తలు

Postpaid Family Plans | ఇంట్లో అందరూ ఇప్పటికీ ప్రీపెయిడ్ వాడుతున్నారా..? పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు చాలా బెటర్..
మే 16, 2026

BSNL Recharge Plan | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. 70 రోజుల వ్యాలిడిటీ, హైస్పీడ్ డేటాతో రూ.599 కొత్త రీఛార్జ్ ప్లాన్..!
ఏప్రిల్ 27, 2026

Reliance Industries | ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన రిలయన్స్ షేర్లు.. అప్పట్లో రూ.10వేలు పెట్టి ఉంటే ఇప్పుడు కోట్లు లాభం..
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



