Road Accident | బోల్తా పడ్డ అయ్యప్ప భక్తుల బస్సు.. 15 మందికి గాయాలు
Road Accident | ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సాంబేపల్లి వద్ద అయ్యప్ప భక్తులకు చెందిన మినీ బస్సు బోల్తా పడింది.
Road Accident | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున సాంబేపల్లి వద్ద అయ్యప్ప భక్తులకు చెందిన మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ భక్తులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతి వేగం వల్ల అయ్యప్ప భక్తుల బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడినట్లు పోలీసులు నిర్ధారించారు. భక్తులందరూ శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
శబరిమల నుండి హైదరాబాద్ వస్తున్న అయ్యప్ప భక్తుల బస్సుకు ప్రమాదం
అన్నమయ్య జిల్లా సాంబేపల్లి వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడిన మినీ బస్సు
ప్రమాదం సమయంలో మినీ బస్సులో 15 మంది భక్తులు.. డ్రైవర్, కొంత మంది భక్తులకు స్వల్ప గాయాలు pic.twitter.com/T7eXQdPpA3
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





