Telangana Indiramma Houses | 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి
దశాబ్ద కాలంగా తహసీల్దార్ ఆఫీసుల్లో చిక్కుకుపోయిన 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
సంక్షిప్త సారాంశం
2014కు ముందు ఇందిరమ్మ పథకం కింద నిర్మించుకున్న 7 లక్షల ఇళ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తహసీల్దార్ కార్యాలయాల్లో ష్యూరిటీగా ఉన్న పట్టా సర్టిఫికెట్లను వెంటనే లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. బ్యాంకు రుణ వాయిదాలు చెల్లించలేక దశాబ్ద కాలంగా పట్టాలు అందక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించింది. 22ఏ భూసమస్యలపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చరిత్రాత్మక నిర్ణయం అమలులోకి వచ్చింది.
- 2014 ముందు ఇళ్ల పథకం లబ్ధిదారులకు భారీ ఊరట
- కుదువ పెట్టుకున్న పట్టా సర్టిఫికెట్లను తిరిగి బాధితులకే ఇచ్చేయాలని నిర్ణయం
- కలెక్టర్లను ఆదేశించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి
- 7 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
- దశాబ్దకాలపు నిరీక్షణకు ముగింపు
Telangana Indiramma Houses | త్రినేత్ర న్యూస్ : రుణ వాయిదాలు సరిగ్గా చెల్లించలేక తమ ఇంటి పట్టాలు చేతికి రాక దశాబ్ద కాలంగా తీవ్ర ఆవేదన చెందుతున్న పాత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభ వార్త. వారందరికీ ఇళ్ల పట్టాలు అంద జేయాలని ప్రభత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది.
గతంలో అమలు చేసిన విధానం ప్రకారం ప్రభుత్వం వద్దనే ఉన్న లబ్ధిదారుల ఇండ్ల పట్టాలు/పొసెషన్ సర్టిఫికేట్లను తిరిగి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం తెలిపారు. ఈ మేరకు ప్రతికా ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం ద్వారా 7 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది.
ఆ పట్టాలు.. ష్యూరిటీగా
2014 కంటే ముందు అమలు చేసిన ఇందిరమ్మ పథకంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే సబ్సిడీతో ఇచ్చేది. లబ్ధిదారులు కొంత వెచ్చించేవారు. మిగిలిన ఆర్థిక సాయాన్ని బ్యాంకు రుణం ద్వారా అందించేవారు. కాగా ఈ రుణాలు పూర్తిగా చెల్లించేవరకు ఆ పట్టాలను తహసీల్ దార్ కార్యాలయాల్లో ష్యూరిటీగా ఉంచుకునేవారు. రుణ వాయిదాలన్నిటిని సక్రమంగా కట్టి, మొత్తాన్ని తిరిగి చెల్లించిన వారికి పట్టాలను తిరిగి ఇచ్చేవారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత , ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని నిలిపివేయడంతో ఇళ్ల పట్టాలు లబ్దిదారులకు అందలేదు. దాదాపు దశాబ్దానికి పైగా లబ్ధిదారులకు సంబంధించిన వారి ఇంటి పట్టా సర్టిఫికేట్లు తిరిగి రాకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఇటీవల.. 22ఎ సమస్యపై సమీక్షలు జరిగిన సమయంలో... ఈ పట్టాలు తహసీల్దార్ ఆఫీస్ లలో భారీగా ఉన్నాయి. వీటిని వెంటనే పేదలకు వాటిని వాపస్ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kavitha | పవర్స్టార్ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర
- ●Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!
- ●MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?
- ●Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?
- ●Teja Sajja | సందడిగా తేజా సజ్జా ఎంగేజ్మెంట్ - కాబోయే భార్య పేరు చెప్పేసిన హనుమాన్ హీరో
- ●Silver Prices | రూ.4 లక్షల నుంచి రూ.1.69 లక్షలకు పడిపోయిన వెండి ధర.. భారీ పతనానికి కారణాలివే..

Kavitha | పవర్స్టార్ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర

Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!

MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?

Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?




