CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం వంటి చారిత్రక కట్టడాల్లోని శిల్ప, వాస్తు ప్రత్యేకతలు ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు.
CM Revanth Reddy | ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం వంటి చారిత్రక కట్టడాల్లోని శిల్ప, వాస్తు ప్రత్యేకతలు ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు. ఈ మూడు నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలకు ఎదురవుతున్న సమస్యలు, చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల పనులపై అధికారులు సీఎంకు వివరించారు.
శాఖల మధ్య సమన్వయంతో..
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల పరిధిలో విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహాల మళ్లింపు, రహదారుల డైవర్షన్, బీఎస్‌ఎన్‌ఎల్ కేబుళ్లు, తాగునీటి పైపులైన్ల తరలింపు వంటి అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శాఖ విడివిడిగా పనులు చేపట్టడం వల్ల జాప్యం, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్, ఆర్‌అండ్‌బీ, తాగునీరు, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతోనూ చర్చించి అన్ని పనులు సమాంతరంగా జరిగేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. విమానాశ్రయాల చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ సమీపం నుంచి రహదారులను అభివృద్ధి చేసి.. వాటిని జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం చెప్పారు. విమానాశ్రయాలకు రాకపోకలు సులభంగా ఉండేలా విస్తృత రహదారులు నిర్మించాలని ఆదేశించారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సిన అవసరం ఉంటే.. విమానాశ్రయ ప్రాంగణంలో లేదా సమీపంలో చెరువులు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి ప్రవాహాన్ని మళ్లించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
డిజైన్లలో మార్పులు
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతో పాటు ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. ప్రతి నిర్మాణంలోనూ తెలంగాణ శిల్ప, వాస్తు సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. డిజైన్లలో పలు మార్పులను సూచించారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్, పవర్‌గ్రిడ్ ఈడీ డోమన్ యాదవ్, టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఎయిర్ కమోడోర్ రాహుల్ శుక్లా, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, స్థపతి ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
సెప్టెంబర్ 22, 2026

Honda Electric Scooter | హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 145 కిలోమీట్లరు దూసుకెళ్లొచ్చు..!
సెప్టెంబర్ 22, 2026

CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Honda Electric Scooter | హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 145 కిలోమీట్లరు దూసుకెళ్లొచ్చు..!
- ●CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
- ●Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!
- ●Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Honda Electric Scooter | హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 145 కిలోమీట్లరు దూసుకెళ్లొచ్చు..!

CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!

Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!



