త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assistant Professors | యూనివ‌ర్సిటీల్లో అధ్యాప‌కుల కొర‌త‌.. త్వరలో 500 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు భర్తీ!

Assistant Professors | త్రినేత్ర‌.న్యూస్‌: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (Assistant Professors) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంట్రాక్టు అధ్యాపకులను యథాతథంగా కొనసాగిస్తూనే.. మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

G

Telangana | Published On Mar 4, 2026, 8.07 am IST

Assistant Professors | యూనివ‌ర్సిటీల్లో అధ్యాప‌కుల కొర‌త‌.. త్వరలో 500 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు భర్తీ!
Advertisement

Assistant Professors | త్రినేత్ర‌.న్యూస్‌: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (Assistant Professors) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంట్రాక్టు అధ్యాపకులను యథాతథంగా కొనసాగిస్తూనే.. మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా సుమారు 500 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల్లో నియామకం (Assistant Professor Recruitment) చేపట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేయ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

రాష్ట్రంలో 13 వర్సిటీలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 2994 పోస్టులు మంజూర‌య్యాయి. వాటిల్లో 763 మంది రెగ్యులర్‌ బోధన సిబ్బంది పనిచేస్తున్నారు. మ‌రో 1174 మంది కాంట్రాక్టు, 544 మంది పార్ట్‌టైం అధ్యాపకులు ఉన్నారు. దీంతో కాంట్రాక్టు అధ్య‌ప‌కుల ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా సుమారు 500 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లను నియమించాల్సి ఉంది. సహాయ ఆచార్యుల ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని గతేడాది ఏప్రిల్‌ 4న విద్యాశాఖ జీఓ21 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఉస్మానియా యూనివ‌ర్సిటీలో 250, కాకతీయలో 145 పోస్టులతో పాటు పాలమూరు, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీల పాలకమండళ్ల సమావేశంలో ఆమోదం తీసుకున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన దస్త్రాలు సీఎం కార్యాలయ పరిశీలనలో ఉన్నాయి.

అయితే యూజీసీ నిబంధనలకు భిన్నంగా జీఓ 21లో పీహెచ్‌డీకి వెయిటేజీ మార్కులు తక్కువగా ఇచ్చారని, దాన్ని మార్చాలని కాంట్రాక్టు అధ్యాపకులు, నిరుద్యోగులు అభ్యంతరం వ్య‌క్తం చేశారు. పీహెచ్‌డీ విద్యార్హతకు 10 మార్కులు కాకుండా 30 ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. తమను కాంట్రాక్టు అధ్యాపకులుగా గుర్తించాలని పార్ట్‌టైం అధ్యాపకులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్న‌ది. అవసరమైన సవరణలపై నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం అధికారులు విద్యామండలిని మౌఖికంగా ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

జీవో 21లో ఏముందంటే..

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్​మెంట్​కు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ మేరకు గ‌తేడాది ఏప్రిల్​ 4న జీవో నంబ‌ర్‌ 21 జారీ చేసింది. దీని ప్రకారం గతంలో ఉన్న నియామక నిబంధనలను రద్దు చేసి, కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియ చేపట్టే విధానం అమల్లోకి తెచ్చింది.

మూడు దశల్లో నియామక ప్రక్రియ

1. అకడమిక్ రికార్డ్ & పరిశోధన ప్రదర్శన (50 మార్కులు)

కంపోజిషన్: వైస్ ఛాన్సలర్, ఉన్నత విద్యామండలి సబ్జెక్ట్ నిపుణుడు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్, మరియు హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ కన్వీనర్‌గా ఉండే స్క్రూటినీ కమిటీ అంచనా వేస్తుంది.

UG మార్కులు:

70 శాతం పైగా – 8 మార్కులు
60–70 శాతం– 6 మార్కులు
50–60 శాతం– 4 మార్కులు
50 శాతం కంటే తక్కువ – 2 మార్కులు

PG మార్కులు:

  • 70 శాతం పైగా – 12 మార్కులు
  • 60–70 శాతం– 10 మార్కులు
  • 50–60 శాతం– 8 మార్కులు

అర్హత పరీక్షల మార్కులు:

  • JRF– 10 మార్కులు
  • NET/SET/SLET– 5 మార్కులు
  • Ph.D– 10 మార్కులు
  • M.Phil– 5 మార్కులు

రీసెర్చ్ పబ్లికేషన్లు, కాన్ఫరెన్సులు: గరిష్ఠంగా 5 మార్కులు

టెక్నికల్ విభాగాలు (AICTE గైడ్‌లైన్స్): లేకపోతే GATE తరహా పరీక్ష – 20కి స్కేల్, Ph.D. వారికి నార్మలైజ్ చేస్తారు.

2. విషయ పరిజ్ఞానం, బోధనా నైపుణ్యం (30 మార్కులు)

స్క్రీనింగ్ కమిటీ: డీన్, ఉన్నత విద్యామండలి నిపుణుడు, వీసీ నామినేట్ చేసిన నిపుణుడు

బోధనా అనుభవం: సంవత్సరానికి 1 మార్కు (గరిష్టంగా 10)

పుస్తక రచన:

  • స్వీయ రచన- 5 మార్కులు
  • సంయుక్త రచన- 3 మార్కులు
  • ఎడిటర్‌గా- 2 మార్కులు

ఫెలోషిప్స్: పోస్ట్-డాక్టరల్ ఫెలోషిప్/రిసెర్చ్ అసోసియేట్- 2 మార్కులు/సంవత్సరం (గరిష్టం 5)

డెమో లెక్చర్: గరిష్టంగా 10 మార్కులు

3. ఇంటర్వ్యూ (20 మార్కులు)

వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అభ్యర్థి డొమైన్ నాలెడ్జ్, సబ్జెక్ట్ ప్రెజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం అంచనా ఆధారంగా మార్కులుంటాయి.

షార్ట్‌లిస్టింగ్, పారదర్శకత: ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్‌సైట్లలో ప్రచురిస్తారు. 1:10 నిష్పత్తిలో టాప్ 10 మంది రెండవ దశకు, 1:5 నిష్పత్తిలో టాప్ 5 మంది చివరి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రెండు సందర్భాల్లోనూ రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisement
Advertisement