Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!
heyutha Pension | కొత్త పింఛన్లు అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం అంటూ ఊరిస్తున్న (New Pensions) ప్రభుత్వం.. ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చింది. చేయూత పెన్షన్ల (Cheyutha Pension) కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించింది.
Cheyutha Pension | త్రినేత్ర.న్యూస్: కొత్త పింఛన్లు అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం అంటూ ఊరిస్తున్న (New Pensions) ప్రభుత్వం.. ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చింది. చేయూత పెన్షన్ల (Cheyutha Pension) కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించింది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించింది. జూలై నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించిన తర్వాత అర్హులైనవారికి పింఛన్లను పంపిణీ చేయనుంది. ఇప్పటికే చేయూత అందుకుంటున్న వారితోపాటు కొత్తవారికి కూడా ప్రతి నెలా బ్యాంకు ఖాతాల్లనే నగదును జమచేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
తుది దశకు అనర్హుల ఏరివేత..
రాష్ట్ర వ్యాప్తంగా పింఛను లబ్దిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం గత నెల రోజులుగా సర్వే నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖారుతో సర్వే ముగియనుండటంతో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది. నిజమైన లబ్దిదారులను గుర్తించేందుకు, పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థను (SERP) రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా లైవ్ అథెంటికేషన్ సర్వే నిర్వహిస్తున్నది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ చేపట్టి అనర్హులను గుర్తిస్తోంది. ఈ క్రమంలో నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారిలో ఇప్పటివరకు ఏకంగా 93,624 మందిని అనర్హులుగా అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 42 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో బ్యాంక్ అకౌంట్లలో నేరుగా పింఛన్లు పొందుతున్నవారు 19,04,239 మంది ఉన్నారు. ఈ బ్యాంకు ఖాతాల జాబితా ఆధారంగానే సెర్ప్ ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించి సర్వే చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ప్రస్తుతం 15.97 లక్షల మంది సర్వే పూర్తి చేశారు. వారిలో 93,624 మందిని అనర్హులుగా గుర్తించింది. అందులో 40,751 మంది మరణించగా.. వారి పేరుతో ఇంకా నిధులు విత్ డ్రా అవుతున్నట్లు తేలింది. మరో 41,689 మంది ఆచూకీ లభించడం లేదు. మిగిలిన 3,495 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇక 11 వేల మంది ఆధార్లు చెల్లకపోయినప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్లు తేలింది. ఈ నెలాఖరు నాటికి వంద శాతం సర్వే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా, అనర్హులను తొలగిస్తూనే కొత్తగా 2 లక్షల పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అర్హుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
సంబంధిత వార్తలు

DTO Venkanna | డీటీవో వెంకన్న మృతిపై విచారణకు ఆదేశించిన సర్కారు
జూన్ 22, 2026

SBI | ఎస్బీఐ తీరుపై సర్కారు సీరియస్.. ఆర్థిక సంబంధాలపై పునఃసమీక్షించే ఆలోచనలో ప్రభుత్వం?
జూన్ 21, 2026

CM Revanth Reddy | అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించండి.. కిషన్‌రెడ్డికి మరోసారి సీఎం రేవంత్ లేఖ
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం
- ●Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!
- ●ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..
- ●PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ
- ●Balakrishna | నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా - స్పెషల్ అట్రాక్షన్‌గా నందమూరి తేజస్విని
- ●South Africa vs South Korea | తొలిసారి నాకౌట్‌కు సౌతాఫ్రికా.. సౌత్ కొరియాకు భారీ షాక్!

SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం

Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!

ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..

PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ



