Control Room | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత.. తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్
ontrol Room | మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ (Telangana) పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేసింది.
Control Room | త్రినేత్ర.న్యూస్: మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ (Telangana) పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేసింది. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో ఉంచుకుని కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అవసరమైన సమన్వయం, సహాయం అందించేలా పనిచేస్తుందన్నారు.
మధ్యప్రాచ్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తున్నదని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు
- వందన బరువా, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ అండ్ లైజన్ హెడ్- +91 9871999044
- సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 9958322143
- జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్- 9910014749
- రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 9643723157
మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

PM Modi | యూఏఈపై దాడులు ఆమోదయోగ్యం కాదు.. పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం : ప్రధాని మోదీ
మే 15, 2026

Sanjay Malhotra | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదు.. ఆర్బీఐ గవర్నర్ కీలక హెచ్చరికలు
మే 13, 2026

IT employees | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేయండి : కేంద్రానికి ‘నైట్స్’ లేఖ
మే 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



