NTPC Power | ఎన్టీపీసీ విద్యుత్‌పై క్లారిటీ.. 800 మెగావాట్లు కొనుగోళ్లకు ప్రభుత్వం ఒప్పందం
NTPC Power | పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఎట్టకేలకు (NTPC Power) సందిగ్ధత తొలగిపోయింది. ఎన్టీపీసీ ప్రాజెక్టు రెండో దశ థర్మల్ పవర్ కేంద్రం నుంచి కరెంటు కొనేందుకు (Power Purchase) రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది.
NTPC Power | త్రినేత్ర.న్యూస్: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఎట్టకేలకు (NTPC Power) సందిగ్ధత తొలగిపోయింది. ఎన్టీపీసీ ప్రాజెక్టు రెండో దశ థర్మల్ పవర్ కేంద్రం నుంచి కరెంటు కొనేందుకు (Power Purchase) రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మొన్నటివరకు సుముఖత చూపకపోవడంతో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా ఇతర రాష్ర్టాలతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (PPA) చేసుకోవడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి 800 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు పీపీఏ చేసుకుంది. మిగిలిన 1,600 మెగావాట్లలో గుజరాత్ 800 మెగావాట్లు, కర్ణాటకతో 600 మెగావాట్లకు ఇప్పటికి పీపీఏ కుదిరినట్టు తెలిసింది. ఇతర రాష్ర్టాలతో సంప్రదింపుల నేపథ్యంలో ట్రాన్స్‌కో కార్యాలయంలో ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ అధికారులతో ఎన్టీపీసీ కమర్షియల్ జీఎం ఒప్పంద సంతకాలు చేయడం గమనార్హం.
విభజన చట్టం ప్రకారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్తు కేంద్రాలను నిర్మించాల్సి ఉంది. మొదటి దశలో 1600 మెగావాట్ల రెండు యూనిట్లను నిర్మించారు. ఎన్టీపీసీ రెండో దశలో చేపట్టే 2 వేల 400 మెగావాట్ల మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులపై సందిగ్ధత ఏర్పడింది. రెండో దశలో నిర్మించనున్న 2400 మెగావాట్ల మూడు యూనిట్లకు 24 వేల కోట్లతో అంచనాలు రూపొందించి బీహెచ్ఈఎల్ సంస్థతో అవగాహన కుదిరింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవటానికి ముందుకు రాకపోవటంతోనే నిర్మాణానికి ముందడుగులు పడలేదు. దీంతో ఎన్టీపీసీ యజమాన్యం ప్రత్యామ్నాయంగా కర్ణాటక, గుజరాత్, పుదుచ్చేరితో పీపీఏ చేసుకోవటానికి సంప్రదింపులు జరిపింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






