త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponguleti | క్యూర్ పరిధిలో పేదలకు సంతృప్తినిచ్చే ఇళ్ల డిజైన్లు : మంత్రి పొంగులేటి

Minister Ponguleti | పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేలా అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

P

Telangana | Published On May 29, 2026, 8.46 pm IST

Minister Ponguleti | క్యూర్ పరిధిలో పేదలకు సంతృప్తినిచ్చే ఇళ్ల డిజైన్లు : మంత్రి పొంగులేటి
Advertisement

Minister Ponguleti | పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేలా అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా పేదలకు సౌకర్యవంతమైన, భద్రమైన ఇళ్ల నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల నమూనా డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

రాబోయే 40-50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ఇళ్లు నిర్మించడం కాకుండా డ్రైనేజీ, పార్కింగ్‌, వాణిజ్య అవసరాలు, ప్రజల జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైతే 10 అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హాల్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌, బాత్‌రూమ్‌ల రూపకల్పనలో వాస్తుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పేద కుటుంబాలు సంతోషంగా జీవించేలా ప్రతి డిజైన్ ఉండాలన్నారు. పార్కింగ్‌తో పాటు షాపుల ఏర్పాటుకు అవకాశం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, అదే ప్రాంత ప్రజలకు అక్కడే ఇళ్లు నిర్మించాలని మంత్రి తెలిపారు. ప్రజలు తమ ఉపాధికి దూరం కాకుండా నివాసాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత తుది డిజైన్లను ఖరారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే అర్బన్ హౌసింగ్ మోడల్‌ను తీసుకొస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Advertisement
Advertisement