Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ‘డబుల్ పే’ దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
Aadhaar Verification | ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్, సర్వీస్ వివరాల సమగ్ర ధ్రువీకరణ కోసం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
- ఒకే ఆధార్‌తో రెండు శాఖల్లో జీతాలు..
- 40 మంది రెగ్యులర్ ఉద్యోగులపై ప్రాథమిక ఆధారాలు
- డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్‌లపై ప్రత్యేక విచారణ..
- అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు
Aadhaar Verification | ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్, సర్వీస్ వివరాల సమగ్ర ధ్రువీకరణ కోసం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకే ఆధార్ నంబర్‌ను ఉపయోగించి రెండు ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి ఒకేసారి వేతనాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ చేపట్టిన ప్రాథమిక పరిశీలనలోనే సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు 40 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ఆధార్ నంబర్‌తో రెండు వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా నమోదై రెండు చోట్ల నుంచి జీతాలు పొందుతున్నట్లు ఆధారాలు లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని కేసుల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని శాఖల్లో విస్తృత స్థాయిలో పరిశీలన ప్రారంభించనున్నారు.
ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో నమోదైన డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్‌లపై ప్రత్యేక విచారణ చేపట్టాలని అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి ఆధార్, సర్వీస్ రికార్డులు, నియామక వివరాలు, వేతన చెల్లింపులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని సూచించింది. విచారణలో అక్రమంగా రెండు చోట్ల నుంచి జీతాలు తీసుకున్నట్లు తేలితే సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆర్థిక శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి శాఖ విచారణను పూర్తిచేసి సమగ్ర నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించాలని సూచించింది. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ఉద్యోగుల వివరాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, భవిష్యత్‌లో ఒకే వ్యక్తి పేరుతో బహుళ శాఖల్లో వేతనాలు పొందే అవకాశాలను పూర్తిగా నివారించడమే ఈ ప్రత్యేక ధ్రువీకరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
సెప్టెంబర్ 22, 2026

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
సెప్టెంబర్ 21, 2026

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



