త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Life Tax | ఇక‌పై రెండో వాహనం కొంటే అదనపు లైఫ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు.. 23 నుంచి అమల్లోకి

Life Tax | మీకు ఇప్ప‌టికే ఒక వాహ‌నం ఉందా.. రెండో వెహిక‌ల్ కొనాల‌నుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్‌. రెండో వాహ‌నం రిజిస్ట్రేష‌న్‌పై (Second Vehicle Registration) అద‌నంగా విధిస్తున్న 2 శాతం లైఫ్‌ ట్యాక్స్‌ను (Life Tax) రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది.

G

Telangana | Published On Mar 21, 2026, 11.38 am IST

Life Tax | ఇక‌పై రెండో వాహనం కొంటే అదనపు లైఫ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు.. 23 నుంచి అమల్లోకి
Advertisement

Life Tax | త్రినేత్ర‌.న్యూస్‌: మీకు ఇప్ప‌టికే ఒక వాహ‌నం ఉందా.. రెండో వెహిక‌ల్ కొనాల‌నుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్‌. రెండో వాహ‌నం రిజిస్ట్రేష‌న్‌పై (Second Vehicle Registration) అద‌నంగా విధిస్తున్న 2 శాతం లైఫ్‌ ట్యాక్స్‌ను (Life Tax) రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇది మార్చి 23 నుంచి అమల్లోకి వస్తుందని ర‌వాణా శాఖ‌ అధికారులు తెలిపారు.

అదేవిధంగా ప్రజలకు పాదదర్శక, వేగవంతమైన సేవల్ని అందించనున్నామ‌ని చెప్పారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ వాహన్‌ పోర్టల్‌తో (VAHAN Portal) తెలంగాణలోని వాహనాల డేటాబేస్‌ను అనుసంధానం చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ నెల 23న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాహ‌న్ పోర్ట‌ల్ సేవ‌ల‌ను ప్రారంభిస్తార‌ని తెలిపారు. దేశవ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమవుతుందని వెల్లడించారు. అదేవిధంగా 52 ర‌కాల సేవ‌లు ఆన్‌లైన్‌లో ద్వారా పొందే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు.

ముఖ్యంగా వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌తోపాటు అమ్మినా, కొన్న త‌ర్వాత ఓన‌ర్‌షిప్ బ‌దిలీల‌కు సంబంధించి ఎలాంటి ఎన్ఓసీలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. వాహ‌నాల రెన్యువ‌ల్స్‌, డూప్లికేట్ లైసెన్సులు తీసుకోవ‌డం, అడ్ర‌స్ మార్పులు, ప‌ర్మిట్లు, ఫీజుల చెల్లింపులు అన్నీ వాహ‌న్ పోర్ట‌ల్ ద్వారానే చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. ఈ పోర్ట‌ల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌స్తే కేవ‌లం లెర్నింగ్ లైసెన్స్‌, వాహ‌నాల ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల కోసం మాత్ర‌మే ఆర్టీఏ కార్యాల‌యానికి వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన అన్నిర‌కాల సేలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొన‌సాగ‌నున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement