Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల శ్లాబుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Indiramma Illu | రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఓ గూడు కల్పించాలనే సంకల్పంతో రేవంత్ సర్కార్( Revanth Govt ) ఇందిరమ్మ ఇళ్ల( Indiramma Illu ) నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసింది.
Indiramma Illu | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఓ గూడు కల్పించాలనే సంకల్పంతో రేవంత్ సర్కార్( Revanth Govt ) ఇందిరమ్మ ఇళ్ల( Indiramma Illu ) నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇండ్ల నిర్మాణ ప్రక్రియ శరవేగంగా దూసుకుపోతోంది. కొన్ని నియోజకవర్గాల్లోని గ్రామాల్లో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుని గృహ ప్రవేశాలు కూడా చేసుకున్నారు.
అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది లబ్ధిదారులు శ్లాబు విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మరోసారి లబ్ధిదారులను అలర్ట్ చేస్తూ జీవో జారీ చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల శ్లాబు 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి పీవీ గౌతమ్ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. శ్లాబు ముందువైపు 3 అడుగులు, మిగతా వైపు ఒక అడుగు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. శ్లాబు విస్తీర్ణం పెరగడం వల్ల లబ్ధిదారులకు ఖర్చు పెరుగుతోందని హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. నిర్మాణ ఖర్చులు పెరగకూడదనే ఉద్దేశంతోనే విస్తీర్ణంపై పరిమితులు విధించినట్లు పేర్కొంది.
తాజావార్తలు
- ●VB-G RAM G | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
- ●Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు
- ●Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!
- ●RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

VB-G RAM G | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు

Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్




