త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG RERA | తెలంగాణ ‘రెరా’ చైర్మన్‌గా కేఎస్ శ్రీనివాసరాజు నియామకం

TG RERA | తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ అథారిటీ( TG RERA ) నూత‌న చైర్మ‌న్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస‌రాజు( KS Srinivasaraju ) నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

S

Telangana | Published On Jun 27, 2026, 7.25 pm IST

TG RERA | తెలంగాణ ‘రెరా’ చైర్మన్‌గా కేఎస్ శ్రీనివాసరాజు నియామకం
Advertisement

TG RERA | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ అథారిటీ( TG RERA ) నూత‌న చైర్మ‌న్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస‌రాజు( KS Srinivasaraju ) నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్‌పర్సన్ పదవీకాలం, జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు రెరా చట్టం 2016, తెలంగాణ రెరా రూల్స్ 2017 ప్రకారం ఉంటాయని జీవోలో పేర్కొన్నారు.

శ్రీనివాస‌రాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజన అనంతరం కూడా తెలంగాణ‌లో పలు కీలక శాఖల్లో ఉన్నత బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా టీటీడీ జేఈవోగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. తెలంగాణ క్యాడర్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. గతేడాది ఆయనను రాష్ట్ర మౌలిక వసతులు, ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఇప్పుడు తాజాగా, రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కీలకమైన రెరా చైర్మన్ పగ్గాలను శ్రీనివాస‌రాజుకు అప్ప‌గించింది రేవంత్ ప్ర‌భుత్వం.

గత చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ(రిటైర్డ్‌ ఐఏఎస్‌) అనారోగ్య కారణాలతో రెరా చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు రెరా ఇన్‌చార్జి చైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు.

Advertisement
Advertisement