త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | హమ్మ‌య్యా.. ఆ ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌కు ప‌ద‌వీ గండం తొలగింది..!

Telangana | తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, ప్రొఫెస‌ర్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివ ప్ర‌తాప్ శుక్లా ఆమోదం తెలిపారు.

S

Telangana | Published On Apr 25, 2026, 1.30 pm IST

Telangana | హమ్మ‌య్యా.. ఆ ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌కు ప‌ద‌వీ గండం తొలగింది..!
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, ప్రొఫెస‌ర్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివ ప్ర‌తాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ ప్ర‌మాణ‌స్వీకారం చేసి ఆరు నెల‌లు పూర్తి కానుంది. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు ఆ ద‌స్త్రంపై గ‌వ‌ర్న‌ర్ సంత‌కం చేశారు. దీంతో అజారుద్దీన్‌తో పాటు మంత్రివ‌ర్గం ఊపిరి పీల్చుకుంది.

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంను నియమిస్తూ గత ఆగస్టు 30న ద‌స్త్రాన్ని గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు తెలంగాణ ప్ర‌భుత్వం పంపింది. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స‌మ‌యంలో అజారుద్దీన్‌ను మంత్రిగా కూడా ప్రమాణం చేశారు. కానీ ఎమ్మెల్సీగా మాత్రం ఆయ‌న‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌లేదు. చివ‌ర‌కు గ‌డువు ముగుస్తుండ‌డంతో శ‌నివారం ఆమోదించారు.

Advertisement
Advertisement