Rythu Bharosa | తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 22 నుంచి ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు..!
Rythu Bharosa | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నగదు నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నది.
Rythu Bharosa | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నగదు నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఉపయోగపడనున్నది. చాలాకాలంగా రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 22న పర్యటిస్తారు.
ఈ పర్యటనలోనే నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రెండు దఫాలుగా రూ.6వేల చొప్పున రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడుతలో ఎకరం వరకు వ్యవసాయ భూమి కలిగిన 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు బదిలీ చేయనుంది. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు మూడో విడతగా మిగతా రైతులకు రైతుభరోసా చెల్లించనున్నది. మూడు విడుతల్లో కలిపి మొత్తం రూ.9వేలకోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



