Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ
Specialist Doctor Posts | ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మరో 500 పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది.
Specialist Doctor Posts | ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మరో 500 పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం విడుదల చేసింది. జనరల్ సర్జరీలో 174, జనరల్ మెడిసిన్‌లో 166, ఆర్థోపెడిక్స్‌లో 89, రేడియాలజీలో 71 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి తుది ఎంపిక జాబితాను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను పూర్తిగా నివారించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 24 విభాగాల్లో 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాల్లో 692 పోస్టుల భర్తీ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయగా, ఇటీవలే పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. తాజా ఫలితాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 1,192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎంపికైన వైద్యులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులను ఆదేశించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్
జులై 28, 2026

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
జులై 28, 2026

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
జులై 28, 2026
తాజావార్తలు
- ●KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్
- ●Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
- ●Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
- ●Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
- ●Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట
- ●RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్

KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?



