KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్
KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటునూ పరిశీలించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
- దీంతోపాటు కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటునూ పరిశీలించండి
- మనోహరాబాద్ - సిద్దిపేట - సిరిసిల్ల - వేములవాడ చొప్పదండి బ్రాడ్‌గేజ్ ప్రాజెక్టు వ్యయం మొదట రూ.1,160 కోట్లతో ప్రారంభమై ఈరోజు రూ.2,780 కోట్లకు చేరింది
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ముల్లుకర్రతో పొడిచి పనులు చేయించండి
- కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీలో కేటీఆర్ విజ్ఞప్తి
KTR Meets Ashwini Vaishnav | త్రినేత్ర.న్యూస్: కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటునూ పరిశీలించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాజీపేట - బల్లార్షా, పెద్దపల్లి - నిజామాబాద్, కాజీపేట - ఎర్రుపాలెం, డోర్నకల్ - మణుగూరు, మోతమర్రి - విష్ణుపురం, కాజీపేట - వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించామన్నారు. ఈమేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐటీ, రైల్వే ప్రాజెక్టుల అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
మాకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యం. తెలంగాణ ప్రగతి ముఖ్యం. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కలవడం జరిగింది. ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ ప్రతిపాదిత కాజీపేట రైల్వే డివిజన్‌కి సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ల పరిధి ఉండే అవకాశం ఉంది. రైల్వే ఉద్యోగులు కూడా ఈ అంశానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఒకవైపు కేవలం 900 కిలోమీటర్లతో గుంటూరు డివిజన్, 2,200 కిలోమీటర్లతో విజయవాడ, గుంతకల్ డివిజన్ కొనసాగుతున్నాయి. కాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే శంకుస్థాపన..
మనోహరాబాద్ - సిద్దిపేట - సిరిసిల్ల - వేములవాడ చొప్పదండి నియోజకవర్గం మీదుగా కొత్తపల్లి న్యూ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నాం. దాదాపు 151 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ పనులు తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష అని చెప్పాం. కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా కేంద్రంలో ఉన్నప్పుడు ఈ రైల్వే లైన్‌కు శంకుస్థాపన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఆగిపోయింది. తిరిగి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మళ్లీ పనులను ప్రారంభించింది. ఉచితంగా భూసేకరణ ఇవ్వడంతో పాటు 'రైట్ ఆఫ్ వే' వంటి అత్యంత కీలకమైన చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పాం అని వివరించారు.
511 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడం వల్లనే..
మూడో వంతు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది అని ఒక ప్రత్యేక ఒప్పందాన్ని చేసుకోవడంతో ఈ రైల్వే లైన్ పనులు వేగవంతమయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవ వల్ల మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు సుమారు 76 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి అయింది. 2023, అక్టోబర్ 3న ఆ రైల్వే లైన్ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. సిద్దిపేట నుంచి సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి వరకు 75 కిలోమీటర్ల మేర మిగిలిన నిర్మాణ పనులు పూర్తిగా మందగించాయి. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్లే ఈ ఆలస్యం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు 511 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడం వల్లనే ఆగిందని కేంద్ర మంత్రి చెప్పారు. భూసేకరణ ఇంకో 96 హెక్టార్లు చేయాల్సి ఉందని రాజ్యసభలో కేంద్రం సమాధానం చెప్పింది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ ప్రాజెక్టు వ్యయం పెరుగుతూ వస్తున్నది. మొదట రూ.1,160 కోట్లతో ప్రారంభమై ఈరోజు రూ.2,780 కోట్లకు చేరింది.
ఈ ప్రాజెక్టు సిరిసిల్లతో పాటు, టెక్స్‌టైల్ హబ్‌గా ఉన్న సిరిసిల్లతో పాటు "దక్షిణ కాశి"గా పేరున్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అత్యంత కీలకం. లక్షల మంది ప్రతి ఏడాది ఈ దేవుణ్ణి దర్శించుకుంటారు. దీంతో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముల్లుకర్రతో పొడిచి పనులు చేయించాలని కోరాం. దీంతో పాటు సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను అత్యధునిక సౌకర్యాలతో 'అమృత్ భారత్ స్టేషన్' పథకంలో చేర్చాలని కోరాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
పీఎం గతిశక్తిని అందుకోవాలంటే..
ధవళేశ్వరం మాదిరిగా మిడ్ మానేరు రిజర్వాయర్ పైన 'రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్' నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరాం. దీంతో పాటు కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్‌ను పూర్తి స్థాయిలో విద్యుతీకరణ చేయాలని విజ్ఞప్తి చేశాం. సౌత్ సెంట్రల్ రైల్వేతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో ఒక ప్రత్యేక హై-లెవెల్ బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షించేలా చూడాలని విజ్ఞప్తి చేశాం. ప్రధాని చెప్తున్న పీఎం గతి శక్తి లక్ష్యాలను అందుకోవాలంటే వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం అని కేటీఆర్ వెల్లడించారు.
50,000 సాంకేతిక ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం..
2014 నుండి 2023 మధ్య BRS ప్రభుత్వం సమతుల్య అభివృద్ధి లక్ష్యంతో IT రంగాన్ని జిల్లాలకు విస్తరించడానికి కృషి చేస్తున్నాం. గ్రామీణ అర్బన్ ప్రాంతాల యువతకు నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడం, వలసలను తగ్గించడం, హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించడం ముఖ్య ఉద్దేశం. 2020లో 'రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీ, 'GRID పాలసీ'లను ప్రవేశపెట్టి Tier-2, Tier-3 నగరాల్లో దాదాపు 50,000 సాంకేతిక ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో 7 వేల జాబ్స్ తగ్గాయి..
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్, నల్గొండ వంటి 8 జిల్లాల్లో అత్యాధునిక IT టవర్లను స్థాపించాం. సైయెంట్ (Cyient), టెక్ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించడమే ఈ ద్వితీయ శ్రేణి నగరాల IT మోడల్ విజయానికి నిదర్శనం. గత రెండేళ్ల కాలంలో ఈ జిల్లాల్లో IT విస్తరణ వేగం మందగించడం, ఆక్యుపెన్సీ తగ్గడం, కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను తగ్గించుకోవడం ఆందోళనకరం. మా హయంలో 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే ఈరోజు కాంగ్రెస్ పాలనలో పెరగాల్సిన జాబ్స్ 7 వేలు తగ్గాయి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు.
తెలంగాణలోని Tier-2 IT రంగాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం, MeitY సహకారాన్ని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశాం. రెండవ అతి పెద్ద పట్టణంలో వరంగల్‌లో ఒక 'IndiaAI సెంటర్ / IndiaAI డేటా ల్యాబ్'ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరాం. కరీంనగర్ లేదా ఖమ్మంలో AI, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ డిజైన్, డిప్ టెక్ రంగాలపై దృష్టి సారించే STPI సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ (CoE) ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం. రాష్ట్రంలోని మరో Tier-2 నగరంలో అదనంగా ఒక STPI కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరాం.
అందుబాటులో ఉన్న IT టవర్ల మౌలిక సదుపాయాలను వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వ AI, డిజిటల్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను జిల్లాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణ వద్ద పాలసీ ఫ్రేమ్‌వర్క్ సిద్ధంగా ఉన్నందున, కేంద్రం సహకరిస్తే ఈ నగరాలు మళ్లీ ఉపాధి, ఆవిష్కరణల కేంద్రాలుగా మారతాయి. తెలంగాణ Tier-2 IT మోడల్‌ను బలోపేతం చేయడం ద్వారా ఇది దేశవ్యాప్తంగా సమతుల్య డిజిటల్ అభివృద్ధికి ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది అని స్పష్టం చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ
జులై 28, 2026

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
జులై 28, 2026

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
జులై 28, 2026
తాజావార్తలు
- ●Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ
- ●Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
- ●Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
- ●Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
- ●Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట
- ●RTC Employees save a girl | 10 రూపాయల నోటుతో బస్సెక్కిన బాలిక.. కదలికలు చూసి కాపాడిన డ్రైవర్, కండక్టర్

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు

Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?



