త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అకడమిక్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక చర్చలు జరిపింది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది.

J

Telangana | Published On Aug 22, 2026, 6.45 pm IST

Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్
Advertisement
  • ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అకడమిక్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్‌ఫుల్ మీటింగ్
  • సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు జయేష్ రంజన్, రామకృష్ణారావు హాజరు
  • హైదరాబాద్‌లో జాయింట్ రీసెర్చ్, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుపై కీలక చర్చలు
  • 'తెలంగాణ రైజింగ్' లక్ష్యంగా రాష్ట్రాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్‌గా మార్చేందుకు యాక్షన్ ప్లాన్

Cambridge University | త్రినేత్ర.న్యూస్ : 'తెలంగాణ రైజింగ్' (Telangana Rising) టార్గెట్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఎడ్యుకేషన్, రీసెర్చ్ సెక్టార్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు తాజాగా ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ (Cambridge University) ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం ఒక సక్సెస్‌ఫుల్ మీటింగ్ నిర్వహించింది. ఈ కీలక భేటీలో సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌ రంజన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో విద్యా రంగానికి ఉన్న ప్రపంచ స్థాయి అవకాశాలు, ఫ్యూచర్ పార్టనర్‌షిప్‌పై వీరు విస్తృతంగా చర్చించారు.

Telangana CM Revanth Reddy Meets Cambridge Experts to Boost Education and Startups

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మన హైదరాబాద్

హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను, ఇక్కడ ప్రపంచస్థాయి విద్యా సంస్థలకు ఉన్న అపారమైన అవకాశాలను తెలంగాణ డెలిగేషన్.. కేంబ్రిడ్జ్ బృందానికి పక్కాగా ప్రజెంట్ చేసింది. రాష్ట్రాన్ని ఒక ఇంటర్నేషనల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చాలన్న తమ విజన్‌లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీనికి స్పందించిన కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట.. తెలంగాణ సర్కార్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు పాజిటివ్‌గా రిప్లై ఇచ్చారు.

Telangana CM Revanth Reddy Meets Cambridge Experts to Boost Education and Startups

స్టార్టప్స్, ఎడ్యుకేషన్‌కు ఫుల్ సపోర్ట్

ఈ మీటింగ్ కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇరు వర్గాలు ఒక సాలిడ్ యాక్షన్ ప్లాన్ (action plan) కూడా రెడీ చేసుకున్నాయి. హైదరాబాద్ వేదికగా జాయింట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, అధునాతన టెక్నాలజీతో కూడిన రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టడంపై ఒక అవగాహనకు వచ్చారు. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు incubation centres ఏర్పాటు, స్టార్టప్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్‌కు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తమ సహకారం అందించనుంది. ప్రపంచ స్థాయి యూనివర్సిటీతో కుదిరిన ఈ ఒప్పందం.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు ఒక పెద్ద గేమ్ ఛేంజర్ కానుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement