Consumer Court | శరత్ సిటీ మాల్‌లోని PUMA షూ కంపెనీకి దిమ్మ తిరిగిపోయే షాక్
Consumer Court | హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్న ప్యూమా (PUMA) షోరూమ్‌కు కన్స్యూమర్ కోర్టు (Consumer Court) షాకిచ్చింది. కొనుగోలు చేసిన రెండు నెలలకే షూస్ పాడైపోవడంతో కస్టమర్‌కు దాని అసలు ధరతోపాటు మిత్తి కూడా చెల్లించాలంటూ తీర్పునిచ్చింది.
Consumer Court | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్న ప్యూమా (PUMA) షోరూమ్‌కు కన్స్యూమర్ కోర్టు (Consumer Court) షాకిచ్చింది. కొనుగోలు చేసిన రెండు నెలలకే షూస్ పాడైపోవడంతో కస్టమర్‌కు దాని అసలు ధరతోపాటు మిత్తి కూడా చెల్లించాలంటూ తీర్పునిచ్చింది.
గచ్చిబౌలికి చెందిన మనీశ్ కుమార్ అనే వ్యక్తి గతేడాది అక్టోబర్ 2న శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో (Sarath City Capital Mall) ఉన్న PUMA స్టోర్‌లో రూ.12,999కు ఒక జత బ్రాండెడ్ షూస్ కొనుగోలు చేశారు. అయితే రెండు నెలలకే అవి పాడైపోయాయి. షూస్ సోల్, పైభాగం ఊడడంతోపాటు చిరిగిపోవడం వంటి లోపాలు తలెత్తాయి. దీంతో డిసెంబర్ 6న స్టోర్‌కు వెళ్లిన మనీశ్ నిర్వాహకులకు జరిగిన విషయం చెప్పారు. అయితే సాధారణంగానే డ్యామేజ్ జరుతుంటాయని పేర్కొంటూ వారంటీ క్లెయిమ్‌ను తిరస్కరించారు. దీంతో కంపెనీ సీఈవో, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంతో మనీశ్.. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (కన్స్యూమర్ కోర్టు)ను ఆశ్రయించారు.
కంపెనీ వాదనలను తోసిపుచ్చిన కోర్డు.. ప్యూమా వారంటీ పాలసీ నిబంధనలలో రెగ్యులర్ వేర్ అండ్ టియర్ అనే మినహాయింపును ఎక్కడా పేర్కొనలేదని కోర్టు గుర్తించింది. అంతేకాకుండా 45 రోజుల వ్యవధిలో ప్యూమా సంస్థ తన లిఖితపూర్వక వివరణ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో వినియోగదారుడు కొనుగోలు చేసిన రూ.12,999 మొత్తంతోపాటు.. 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేయాలని తీర్పు ఇచ్చింది. అదేవిధంగా కస్టమర్‌కు మానసిక క్షోభ కలిగించినందుకు రూ.5 వేలు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.3,000 చెల్లించాలని స్పష్టం చేసింది. రీఫండ్ అందిన 45 రోజుల్లోపు కస్టమర్ ఆ షూస్‌ను కంపెనీకి తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది.
తాజావార్తలు
- ●BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
- ●Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ
- ●Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..
- ●Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
- ●గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!
- ●Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్

BRS Party | అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 6న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

Basavaraju Saraiah | ధైర్యముంటే రాండి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం.. నేన్ రెడీ

Stock Markets | తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలకు స్వల్ప లాభాలు..

Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య



