త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | 23న కేబినెట్ భేటీ.. ఈసారి యాద‌గిరిగుట్ట‌లో..!

Telangana Cabinet | రాష్ట్ర కేబినెట్ స‌మావేశానికి సంబంధించి స్వ‌ల్ప మార్పు చోటు చేసుకుంది. వాస్త‌వానికి ఈ నెల 21న కేబినెట్ స‌మావేశం ఉంటుంద‌ని, స‌చివాల‌యంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On May 19, 2026, 5.58 pm IST

Telangana Cabinet | 23న కేబినెట్ భేటీ.. ఈసారి యాద‌గిరిగుట్ట‌లో..!
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర కేబినెట్ స‌మావేశానికి సంబంధించి స్వ‌ల్ప మార్పు చోటు చేసుకుంది. వాస్త‌వానికి ఈ నెల 21న కేబినెట్ స‌మావేశం ఉంటుంద‌ని, స‌చివాల‌యంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కానీ ఆ రోజున స‌ర‌స్వ‌తి పుష్క‌రాలు ప్రారంభ‌మ‌వుతున్న‌ నేప‌థ్యంలో సీఎంతో పాటు మంత్రివ‌ర్గం అక్క‌డే బిజీగా గ‌డ‌ప‌నున్నారు. దీంతో కేబినెట్ స‌మావేశం తేదీని 21 నుంచి 23వ తేదీకి మార్చుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. 23న యాద‌గిరిగుట్ట‌లో కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అదే రోజుల గుట్ట‌లో సీఎం చేతుల మీదుగా గోశాల ప్రారంభించ‌నున్నారు.

Advertisement
Advertisement