త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | 21న కేబినెట్ భేటీ.. భూముల విలువ పెంపుపై చ‌ర్చ‌..!

Telangana Cabinet | రాష్ట్ర కేబినెట్ 33వ సారి స‌మావేశం కానుంది. ఈ నెల 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటు ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

S

Telangana | Published On May 19, 2026, 3.33 pm IST

Telangana Cabinet | 21న కేబినెట్ భేటీ.. భూముల విలువ పెంపుపై చ‌ర్చ‌..!
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర కేబినెట్ 33వ సారి స‌మావేశం కానుంది. ఈ నెల 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటు ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు. కేబినెట్ భేటీలో భూముల విలువ పెంపు , మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం, రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల‌ పంపిణీపై చర్చించనున్న‌ట్లు స‌మాచారం.

అయితే ప్ర‌ధానంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ‌పైనే కేబినెట్ చ‌ర్చించనున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే భూముల మార్కెట్ విలువ‌ల పెంపు దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్రాంతాల వారీగా ఎంత పెంచాల‌నే దానిపై ఇప్ప‌టికే సంబంధిత అధికారులు నివేదిక‌ల‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే గ‌రిష్ఠంగా వంద శాతం మించి పెంచకుండా సీలింగ్ పెట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో క‌నిష్ఠంగా 5 శాతం నుంచి 100 శాతం వ‌ర‌కు భూముల మార్కెట్ విలువ‌లు పెంచుతూ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి కొత్త మార్కెట్‌ విలువల ప్రకారం స్టాంప్‌ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖ ఏర్పాట్లు చేసిన‌ట్లు స‌మాచారం. భూముల విలువల పెంపు ద్వారా ఈ ఏడాది అదనంగా రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

భూముల మార్కెట్ విలువ ఇలా..

  • గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి విలువను కనిష్ఠంగా రూ.2.75 లక్షలు.
  • మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఎకరా కనిష్ఠ విలువ రూ.5 లక్షలు.
  • ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ఠంగా రూ.15 లక్షలు.
  • ఓఆర్‌ఆర్‌ ఆనుకుని ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలో ఎకరా రూ.10 లక్షలు.
  • ఓఆర్‌ఆర్‌ లోపల చదరపు గజం విలువ కనిష్ఠంగా రూ.3500 నుంచి రూ. 4000.
  • ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ ధర రూ.3000 నుంచి రూ.3500.
  • మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2500 నుంచి రూ.3000.
  • గ్రామీణ ప్రాంతాల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2000.
  • ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి.. 15-20 శాతం ప్లాట్లకు వంద శాతం పెంపు.
  • ఓఆర్‌ఆర్‌ లోపల రియల్‌ ఎస్టేట్‌ జోరుగా ఉన్నచోట్ల 50 శాతం ప్రాంతాల్లో ఫ్లాట్ల విలువను ఇప్పుడున్న దానికన్నా వంద శాతం పెంచుతున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement