త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | 23న తెలంగాణ కేబినెట్ భేటీ..!

Telangana Cabinet | ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

S

Telangana | Published On Apr 20, 2026, 5.23 pm IST

Telangana Cabinet | 23న తెలంగాణ కేబినెట్ భేటీ..!
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటు ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల నిర్వ‌హించే అంశంతో పాటు జూన్ 2న నిర్వ‌హించ‌బోయే రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాలు, ఇత‌ర అంశాల‌పై కేబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రైతు భ‌రోసా చివ‌రి విడుత నిధుల విడుద‌ల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement