త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగ‌దుర్గ రొమాన్స్ – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌నార్తి

ఇడుపుకాయితం త‌ర్వాత ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ మ‌రో తెలంగాణ సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్నారు. రాజు వెడ్స్ రాంబాయి హీరోతో జోడీక‌ట్ట‌బోతుంది. అఖిల్ రాజ్‌, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న శ‌నార్తి మూవీ శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు.

N

Entertainment | Published On Aug 14, 2026, 4.13 pm IST

Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగ‌దుర్గ రొమాన్స్ – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌నార్తి
Advertisement

Naga Durga |ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్‌ నాగ‌దుర్గ హీరోయిన్‌గా బిజీ అవుతోంది. ఇటీవ‌లే ల‌వ్ ఓ ల‌వ్ సినిమాతో త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా బ్యాక్ టూ బ్యాక్ ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటోంది. తెలంగాణ నేప‌థ్య క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోతుంది. నాగ‌దుర్గ హీరోయిన్ ఇటీవ‌లే ఇడుపుకాయితం పేరుతో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ లాంఛ్ అయ్యింది. డైరెక్ట‌ర్ సుకుమార్‌తో క‌లిసి బ‌న్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఇడుపుకాయితం షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

రాజు వెడ్స్ రాంబాయి...

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాక‌ముందే మ‌రో తెలంగాణ సినిమాకు నాగ‌దుర్గ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. శ‌నార్తి పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ శుక్ర‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ హీరోగా న‌టిస్తున్నాడు.

సంప‌త్ నంది ప్రొడ్యూస‌ర్‌...

శ‌నార్తి సినిమాతో గ‌ణేష్ రాజ్ ఉప్పునూతి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. కేవీ శ్రీధ‌ర్ రెడ్డితో క‌లిసి డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బ‌లి మ్యూజిక్ అందిస్తున్నారు. తెలంగాణ యాస‌, భాష‌ల‌తో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఎమోష‌న‌ల్ డ్రాగా ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

ప్రీ లుక్ పోస్ట‌ర్‌

శ‌నార్తి ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ చేతికి కుంకుమ‌, హీరో చేతికి పుసుపు రాసి ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. వారి చేతికి కంక‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌రి చిటికెన వేలును మ‌రొక‌రు ప‌ట్టుకొని క‌నిపిస్తున్నారు. శ‌నార్తి షూటింగ్ శుక్ర‌వారం నుంచి మొద‌లైన‌ట్లు స‌మాచారం.

రాజు వెడ్స్ రాంబాయి...

ఇటీవ‌లే అఖిల్ రాజ్‌, నాగ‌దుర్గ కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న ఆల‌యాన్ని సంద‌ర్శించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ ప్ర‌చారం జ‌రిగింది. శ‌నార్తి సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకొనే వీరిద్ద‌రు కొముర‌వెల్లి ఆల‌యానికి వ‌చ్చార‌ని శుక్ర‌వారం ఓపెనింగ్ ఈవెంట్‌తో క్లారిటీ ఇచ్చారు. రాజు వెడ్స్ రాంబాయి మూవీతోనే అఖిల్ రాజ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సాయిలు కంపాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

 

 

 

 

Advertisement
Advertisement