IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
IND Vs SL | శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు శుభ్‌మన్ గిల్ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
IND Vs SL | శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు శుభ్‌మన్ గిల్ మరోసారి నాయకత్వం వహించనున్నాడు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సారాంశ్ జైన్‌ను సెలక్టర్లు తొలిసారి సీనియర్ జట్టుకు ఎంపిక చేశారు. వికెట్ కీపింగ్ బాధ్యతలను రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ నిర్వహించనున్నారు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ చోటు దక్కించుకున్నారు.
జడేజా పునరాగమనం..
ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్లకు అవకాశం లభించింది. వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు అందుబాటులో లేనందున అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదని బీసీసీఐ వెల్లడించింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతడితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లకు చోటు దక్కింది. అయితే, బుమ్రా, సాయి సుదర్శన్‌ల ఎంపిక బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఫిట్నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడిన జట్టుతో పోలిస్తే ఈసారి నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు దక్కలేదు. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా టెస్టు జట్టులోకి తిరిగి వచ్చారు. గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో బర్సపారా స్టేడియంలో జరిగిన టెస్టు తర్వాత జడేజా మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు.
భారత్ టెస్టు జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.
శ్రీలంక పర్యటన షెడ్యూల్
తొలి టెస్టు: ఆగస్టు 15-20- గాలె
రెండో టెస్టు: ఆగస్టు 23-27 - కొలంబో
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు
- ●Dulquer Salmaan | వెరైటీ లవ్ సాంగ్‌తో దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ - హీరోయిన్గా అమెరికా అమ్మాయి

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్



