Dulquer Salmaan | వెరైటీ లవ్ సాంగ్‌తో దుల్కర్ సల్మాన్ సర్‌ప్రైజ్ – హీరోయిన్‌గా అమెరికా అమ్మాయి
మహానటి, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత హీరోగా ఆకాశంలో ఒక తార మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దుల్కర్ సల్మాన్. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ బర్త్‌డే సందర్భంగా ఆకాశంలో ఒక తార మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మంగళవారం రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jul 28, 2026, 7.58 pm IST
Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహానటి, లక్కీ భాస్కర్ లాంటి స్ట్రెయిట్ మూవీస్‌తో కథానాయకుడిగా తెలుగులో పెద్ద విజయాలను అందుకున్నాడు. లక్కీ భాస్కర్ తర్వాత తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మూవీ ఆకాశంలో ఒక తార. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్...
దుల్కర్ సల్మాన్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఆకాశంలో ఒక తార సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిట్టి చిట్టి చీమ అంటూ సాగిన మెలోడీ సాంగ్‌ను రమ్య బెహరా ఆలపించింది. నేషనల్ అవార్డ్ విన్నర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. శ్రీమణి సాహిత్యం సమకూర్చారు.
రెగ్యులర్ లవ్ సాంగ్ కాదు...
హీరోయిన్ కోణం నుంచి ఆమె కలలను, లక్ష్యాలను వివరిస్తూ అర్థవంతమైన సాహిత్యంతో ఈ పాట సాగింది. నక్షత్రాలను చేరాలనే ఒక మహిళ కలను, ఆమెకు అండగా నిలిచిన వ్యక్తి ప్రేమ ఈ పాటలో చూపించారు. రెగ్యులర్ లవ్ సాంగ్స్‌కు భిన్నంగా నాయకానాయికల ప్రేమకథను కొత్తగా చిట్టి చిట్టి చీమ సాంగ్‌లో ఆవిష్కరించారు.
ఎవరీ సాత్విక....
ఆకాశంలో ఒక తార మూవీతో ఎన్ఆర్ఐ సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అమెరికాలో పుట్టి పెరిగిన సాత్విక ఇంజినీరింగ్ కంప్లీట్ చేసింది. ఓ హెల్త్‌కేర్ కంపెనీలో కొన్నాళ్లు జాబ్ చేసింది. ఈ సినిమా ఆడిషన్స్‌కు అటెండ్ అయిన సాత్విక...హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో శృతి హాసన్ ఓ బోల్డ్ రోల్‌లో కనిపించబోతుంది. ఆకాశంలో ఒక తార సినిమాను . స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ
- ●KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్
- ●Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు
- ●Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
- ●Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా వైద్యులు ఏమన్నారంటే..?
- ●Jayam Ravi | జయం రవి భార్యకు షాకిచ్చిన కోర్టు - విడాకుల కేసులో కోలీవుడ్ హీరోకు ఊరట

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ

KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్

Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు






