Surender Reddy | భార్యా పిల్లలు మళ్లీ తిరిగొస్తే బాగుండు.. విజయారెడ్డి భర్త సురేందర్
Surender Reddy | నా భార్యాపిల్లలను దుబాయ్ చూపించేందుకు మార్చి నెలలో తీసుకెళ్లాలని అనుకున్నా.. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.. వారు ఆత్మహత్య చేసుకున్న విషయం ఇంకా నమ్మలేకపోతున్నా.. అంటూ విజయారెడ్డి (Vijayashanti Reddy) భర్త పిన్నింటి సురేందర్ రెడ్డి (Surender Reddy) కన్నీటి పర్యంతమయ్యారు.
Surender Reddy | త్రినేత్ర.న్యూస్: నా భార్యాపిల్లలను దుబాయ్ చూపించేందుకు మార్చి నెలలో తీసుకెళ్లాలని అనుకున్నా.. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.. వారు ఆత్మహత్య చేసుకున్న విషయం ఇంకా నమ్మలేకపోతున్నా.. అంటూ విజయారెడ్డి (Vijayashanti Reddy) భర్త పిన్నింటి సురేందర్ రెడ్డి (Surender Reddy) కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్య చాలా ధైర్యవంతురాలు. ఇంట్లో ఆమెదే తుది నిర్నయం. మా పిల్లలకు తల్లిమాట వేదవాక్కు. ఆమె ఏది చెప్పినా తప్పకుండా వింటారు. వారిని అంతే ప్రేమగా చూసుకుంటుంది. అందుకే పిల్లలంటే తల్లికి, తల్లి అంటే పిల్లలకు మహాప్రాణం. ఇటువంటి మా ప్రేమా నురాగాల కుటుంబంలో ఇంతటి ఘోరం ఎలా జరిగింది? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటన్నది దేవుడికే తెలియాలి. అంతా ఒక కలలా ఉంది. ఒక్కసారిగా అందరూ లేచి వస్తే బాగుండంటూ విలపించారు.
జనవరి 31న మేడ్చల్ జిల్లా చర్లపల్లి–ఘట్‌కేసర్ మధ్య విజయారెడ్డి తన కుమార్తె చేతన, కుమారుడు విశాల్ రెడ్డిలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈకేసుకు సంబంధించి విజయారెడ్డి భర్త సురేందర్ పలు విషయాలు వెల్లడించారు.
పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే 14 నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఇద్దరు పిల్లలు ఇంటర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నారన్నారు. జనవరి 27న తన కుమార్తె జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళ్లినప్పుడు తనతో మాట్లాడిందని, పరీక్ష బాగా రాశానని కచ్చితంగా సీటు వస్తుందని చెప్పిందని తెలిపారు. తన తో జనవరి-29న చివరి ఫోన్‌కాల్ మాట్లాడిందని, ఇద్దరం పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకున్నామని, తమ హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకునేది అని అన్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పదేపదే చెప్పేదని తెలిపారు. కుటుంబ తగాదాలుగానీ, ఆర్థిక ఇబ్బందులు గానీ లేవన్నారు. జనవరి 31న ఉదయం 8.30 గంటల సమయంలో తన బావమరిది ఫోన్ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్పాడని, ఎందుకని ప్రశ్నించడంతో విజయశాంతి మరణించిందని చెప్పాడని వెళ్లడించారు.
అనంతరం కొద్దిసేపటికి పిల్లలతో కలిసి చనిపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మధ్యాహ్నం ఫ్లైట్ ద్వారా రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు చెప్పారు. తనకు ఎవరి మీద అనుమానం లేదని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవన్నారు. ఏం జరిగిందో..? ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుందో పోలీసుల విచారణలో తేలుతుందేమో చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. విజయశాంతిరెడ్డి సెల్‌ఫోన్‌ను సైబర్‌క్రైం పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఆమె సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను సైబర్ పోలీసులకు పంపించగా అది ఓపెన్ కాలేదని తెలిసింది. వివరాలు బయటికి తీయడం కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్టు తెలుస్తున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






