CA Student suicide | మీరనుకున్నట్టు చదవలేకపోతున్నా.. క్షమించండి నాన్నా
CA Student suicide | మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఉంటున్న సీఏ విద్యార్థి జనార్ధన్ (Janardhan) ఆత్మహత్య కేసులో పురోగతి లభించింది. బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటు ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు.
- సూసైడ్ నోట్ రాసి సీఏ విద్యార్థి ఆత్మహత్య
- మృతిపై తల్లిదండ్రుల అనుమానాలు
CA Student suicide | త్రినేత్ర.న్యూస్: మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఉంటున్న సీఏ విద్యార్థి జనార్ధన్ (Janardhan) ఆత్మహత్య కేసులో పురోగతి లభించింది. బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటు ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. సీఏ కోర్సు చదవడం తన వల్ల కావడం లేదని, తల్లిదండ్రులు తనను క్షమించాలని అందులో రాసి, నాలుక కోసుకుని ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మియాపూర్ ఎస్సై కృష్ణ వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన జనార్ధన్ (28) చెన్నైలో సీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండు పరీక్షల్లో ఫెయిల్ కాగా వాటి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి మియాపూర్‌లోని స్నేహితులతో ఉంటున్నాడు. గురువారం ఉదయం స్నేహితులు విధులకు వెళ్లగా జనార్ధన్ ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి స్నేహితులు గదికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు లుంగీతో ఉరి వేసుకొని కనిపించాడు. గదిలో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అమ్మ.. నాన్నా. మీరు అనుకున్నట్లు నేను చదువులేక పోతున్నా.. సీఏ కోర్సు చదవడం నా వల్ల కావడం లేదు.. తనను క్షమించాలని లేఖలో పేర్కొన్నాడు. మొదట నాలుక కోసుకొని ఆ తరువాత ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో రక్తపు మరకలు ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




